వాల్తేరు వీరయ్య – వారసుడు – వీరసింహారెడ్డి .. వీటిలో ఏ ట్రైలర్ బాగుందంటే..?

-

2023 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాలో వార్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాలలో ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్నాయి. నట సింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి వారసుడు సినిమాలు పోటీ పడబోతున్నాయి. రెండు పెద్ద నిర్మాణ సంస్థల నుండి ఈ మూడు సినిమాలు రిలీజ్ అవుతుండగా ఒక్కో సినిమా ప్రమోషన్స్ అభిమానులలో అంచనాలు పెంచేస్తున్నాయి అలాగే మరొకవైపు పాటలే కాకుండా ట్రైలర్తో కూడా సినిమాలపై హైప్ పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా ఈ మూడు సినిమాల నుంచి కూడా ట్రైలర్స్ విడుదలయ్యాయి. మరి ఈ ట్రైలర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లభించింది? వీటిలో ఏది ప్రేక్షకులను ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు చూద్దాం.

సంక్రాంతి బరిలో ముందుగా విజయ దళపతి వారసుడు సినిమా రిలీజ్ కాబోతోంది. మొదటిసారి తెలుగు ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ చేసిన సినిమా ఇది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 11న రిలీజ్ కాబోతోంది. ఇందులో రష్మిక హీరోయిన్ కాగా తమన్ సంగీతాన్ని అందించాడు. ఇకపోతే ఈ సినిమా నుంచి ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ లభించింది. మ్యూజిక్ , డైలాగ్స్, ప్రొడక్షన్ వాల్యూ సినిమాపై మరింత ఆసక్తి పెంచేశాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ 30 మిలియన్స్ వ్యూస్ దాటి ట్రెండ్ అవుతోంది.

ఆ తరువాత రోజు నటసింహ బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమా జనవరి 12న రిలీజ్ కావుతోంది. గాడ్ ఆఫ్ మాసేస్ అనే ట్యాగ్ లైన్ తో బాలయ్యను ఊరమాస్ రేంజ్ లో చూపించేశాడు డైరెక్టర్ గోపీచంద్. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ట్రైలర్ లో విజువల్స్ ,ఎనర్జీ , డైలాగ్స్, డాన్సులు , ఫైట్స్ అన్ని కూడా అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ ట్రైలర్ కూడా మిలియన్స్ వ్యూస్ తో దూసుకుపోతూ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. మరోపక్క చిరంజీవి నటిస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య జనవరి 13న రిలీజ్ కానుండగా పక్క మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది. మాస్ రాజా ఎంట్రీ కూడా ఆకట్టుకున్నాయి ఇకపోతే ఈ సినిమా కలెక్షన్ల మోత మోగే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికైతే ఈ మూడు ట్రైలర్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కాబట్టి ఏ హీరో సంక్రాంతి హీరో అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news