మన దేశంలో అత్యంత ముఖ్యమైన డాక్యూమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి.. అయితే ఈ ఆధార్ లో కార్డులోని పుట్టినతేదీ, చిరునామా, పేరులో మార్పులు తదిదర వివరాలు ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా మార్చుకునేందుకు ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ జూన్ 14వరకు అవకాశం కల్పిస్తోంది.. ‘మైఆధార్ పోర్టల్’ ద్వారా మాత్రమే ఈ ఉచిత సేవలు వర్తిస్తాయని ఉడాయ్ తెలిపింది. ఆధార్ సేవా కేంద్రాల ద్వారా అప్‌డేట్, డెమొగ్రాఫిక్ మార్పులు చేస్తే రూ.50 చెల్లించాల్సి వుంటుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది కోసం ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ సౌకర్యం అమలుజేస్తున్నట్టు పేర్కొంది.
కార్డులో పేరు తప్పుగా పడిన లేకుంటే, పుట్టిన తేదీ వివరాలు, చిరునామా లాంటివీ కార్డులో తప్పుగా పడితే జూన్ 14 లోపు సరిచేసుకోవచ్చు.. అది కూడా పదేళ్లల్లో ఎప్పుడు మార్చకుంటేనే.. ఇందుకోసం నిర్దేశిత జాబితాలో సూచించిన గుర్తింపు, చిరునామా పత్రాల్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.. ఇదే చివరి అవకాశం అని చెప్తున్నారు.. అందుకే జాగ్రత్తగా చెక్ చేసి మార్చుకోవాలి..
ఉదాహరణకు చిరునామా అప్‌డేట్ చేయాలనుకుంటే, మైఆధార్ పోర్టల్‌కు వెళ్లి..’అప్‌డేట్ అడ్రస్’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. రిజిష్టర్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని అక్కడ నమోదు చేయాలి. తర్వాత ‘డాక్యుమెంట్ అప్‌డేట్’ పై క్లిక్ చేసి.. దాంట్లో మార్పులు ఉంటే స్కాన్ చేసిన ‘అడ్రస్ ప్రూఫ్’ను అప్‌లోడ్ చేస్తే ఈ ప్రక్రియ ముగుస్తుంది. అయితే చాలామంది ఆధార్ కార్డ్ వినియోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు.. ఈమెరకు ప్రభుత్వం తీసుకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు..