హన్సికను డేట్‌ కు పిలిచింది సున్సీతే !

-

హీరోయిన్‌ హన్సిక గురించి తెలియని వారుండరు. దేశ ముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఇప్పుడు తెలుగులో సినిమాలు చేయడం లేదు. అయితే.. తాజాగా టాలీవుడ్‌ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేసింది హన్సిక. తెలుగులో ఓ హీరో తనని బాగా ఇబ్బందికి గురి చేశాడని..డేట్‌కి వెళ్దాం వస్తావా అంటూ విసిగించేవాడని చెప్పుకొచ్చింది.

అయితే ఆ హీరోకి తగిన రీతిలో తగిన బుద్ది చెప్పానని తెలిపింది. అయితే, ఆ హీరో ఎవరనే విషయాన్ని మాత్రం హన్సిక వెల్లడించలేదు. దీంతో హన్సికను ఇంతలా ఇబ్బంది పెట్టిన ఆ టాలీవుడ్​ హీరో ఎవరై ఉంటారని.. నెటిజన్లలో కొత్త చర్చ మొదలైంది. ఈ తరుణంలోనే.. సునిశిత్‌ సీన్‌ లోకి ఎంటర్‌ అయ్యాడు. హన్సికను డేట్‌ కు రమ్మన్నది నేనే అంటూ పోస్ట్‌ పెట్టాడు. హన్సిక మాట్లాడింది నా గురించే అని కొంతమంది విష ప్రచారం చేస్తున్నారు..హన్సిక నాకు మంచి స్నేహితురాలు ఇలాంటి చిల్లర రాతలతో సునకానందాన్ని పొందేవాళ్ళు మా బంధాన్ని విడదీయలేరంటూ పోస్ట్‌ పెట్టాడు సునిశిత్‌.

Read more RELATED
Recommended to you

Latest news