శీతాకాలంలో చాలా మంది మంచి ప్రదేశాలని చూడాలని అనుకుంటూ ఉంటారు. నిజానికి శీతాకాలంలో హిల్ స్టేషన్ కి వెళ్తే చాలా అందంగా ఉంటుంది. పైగా అది మరిచిపోలేని మెమరీగా మారిపోతుంది. మీరు కూడా ఈ శీతాకాలంలో ఏదైనా టూర్ వెయ్యాలనుకుంటున్నారా..? అరకు చాలా అందమైన ప్రదేశం. పర్యటకులని అరకు బాగా ఆకట్టుకుంటుంది. ఈ శీతాకాలంలో ఒక మంచి ట్రిప్ వేయాలనుకునే వాళ్ళు అరకు వెళ్లొచ్చు అరకులో అందమైన ప్రకృతి ఉంటుంది.
అలానే అక్కడ వాతావరణం కూడా అద్భుతంగా ఉంటుంది. అరకు వెళ్లాలనుకునే వాళ్ళు ఐఆర్సిటిసి అందించే టూర్ ప్యాకేజీ ద్వారా వెళ్లొచ్చు. ఇక IRCTC అందిస్తున్న అరకు ప్యాకేజ్ వివరాలు చూద్దాం. ఇది వన్ డే టూర్ ప్యాకేజ్ మాత్రమే. ఒక రోజు మీరు అరకు అందాలని చూసి వచ్చేయొచ్చు. బొర్రా గుహలు కూడా చూసేయచ్చు. ఇది రైల్ కమ్ రోడ్ ప్యాకేజీ.
వన్ డే టూర్ మాత్రమే. ఈ వన్ డే టూర్ ప్యాకేజీ ప్రతీ రోజూ అందుబాటులో ఉంటుంది. విశాఖపట్నంలో ఈ టూర్ స్టార్ట్ అవుతుంది. ఉదయం విశాఖపట్నంలో 18551 నెంబర్ ట్రైన్ ఎక్కాలి. సొరంగాలు, వంతెనల్ని దాటుతూ రైలు లో అరకు వెళ్లాల్సి ఉంటుంది. ట్రైబల్ మ్యూజియం, టీ గార్డెన్స్, ధింసా డ్యాన్స్ వీటి అన్నింటినీ చూసి వచ్చేయచ్చు.
అరక లో భోజనం అయ్యాక అనంతగిరి కాఫీ తోటలు, గాలి కొండ వ్యూపాయింట్, బొర్రా గుహలు ఇవన్నీ కూడా చూసేయచ్చు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత టూర్ ముగుస్తుంది. ప్యాకేజీ ధర చూస్తే.. ఎగ్జిక్యూటీవ్ క్లాస్ పెద్దలకు రూ.3060, పిల్లలకు రూ.2670, స్లీపర్ క్లాస్ పెద్దలకు రూ.2385 చెల్లించాలి. అదే పిల్లలకి .2015, సెకండ్ క్లాస్ పెద్దలకు రూ.2185, పిల్లలకు రూ.1815 చెల్లించాలి.