బెజవాడలో మంత్రి vsఎంపీ వార్ కొత్త టర్న్ తీసుకుంటుందా

-

బెజవాడలో మంత్రి వెల్లంపల్లి, టీడీపీ ఎంపీ కేశినేని నాని మధ్య మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. గతంలో కరోనా సాయం పేరిట వసూళ్లు అంటూ మంత్రిపై విమర్శలు చేశారు ఎంపీ నాని. దానికి మంత్రి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు.. మళ్లీ మంత్రిపై విమర్శలు చేసి నిప్పు రాజేశారు నాని. ఇది ఏ టర్న్‌ తీసుకుంటుందోననే టెన్షన్ బెజవాడలో నెలకొంది.

టీడీపీ ఎంపీ, కేశినేని నాని, మంత్రి వెల్లంపల్లి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతోంది. సందర్భం దొరికితే చాలు ఇద్దరు నేతలు విమర్శలకు పనిచెబుతున్నారు. 2014లో బీజేపీలో ఉన్న వెల్లంపల్లి ఆ తర్వాత వైసీపీలో చేరి మంత్రి అయ్యారు. అప్పుడు ఇద్దరు కలిసి పోటీచేసినప్పటికీ నానీ ఎంపీ అవ్వగా, వెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. టీడీపీ హయాంలో కేశినేని అభివృద్ధి పనుల్లో భాగంగా అనేక ఆలయాలను పడగొట్టారు. పుష్కర ఘాట్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల నిర్మాణం కోసం జరిగిన కూల్చివేతలపై అనేక విమర్శలు రాజకీయ పోరాటాలు జరిగాయి. వెలంపల్లి బీజేపీ తరపున కేశినేనిపై, టీడీపీపై విమర్శలు చేశారు.

2019లో బెజవాడ వెస్ట్‌ నుంచి గెలిచిన వెల్లంపల్లిపై ఎంపీ కేశినేని విమర్శల దాడి మొదలుపెట్టారు. కరోనా సమయంలో చేసిన సహాయ కార్యక్రమాలపై కేశినేని ఘాటు విమర్శలు చేశారు. వ్యాపారులను బెదిరిస్తున్నరాంటూ ఆరోపించారు. దీనికి కేశినేని ట్రావెల్స్ పేరుతో ఉద్యోగుల డబ్బులు ఎగ్గొట్టిన చరిత్ర తనది కాదంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి. ఇపుడు మళ్లీ మరోమారు కేశినేని వెలంపల్లి టార్గెట్ గా విమర్శలు చేసారు. మంత్రి అవినీతి పరుడని, మంత్రి పదవిని గుళ్లను దోచుకోవడానికి, ప్రజలను దోచుకోవడానికి ఉపయోగిస్తున్నాడన్నారు కేశినేని. దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటూ.. నియోజకవర్గాన్ని సొంత మనుషులకు దోచిపెడుతున్నాడని విమర్శలు గుప్పించారు నాని.

దీనిపై అదే రేంజ్ లో స్పందించాడు మంత్రి వెల్లంపల్లి..తాగి ఫాం హౌస్ లో పడుకుని సంవత్సరానికి ఒకసారి లేచి ట్విట్లు చేసే నానికి నన్ను విమర్శించే సీన్ లేదన్నాడు.కరోనా తో ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ నాని ఎక్కడున్నారన్నారు.ఫాం హౌస్ లో తాగి పడుకుని తన పై పనికి మాలిన విమర్షలు చేస్తున్నాడని మండిపడ్డారు. వీరిద్దరి విమర్షలు కార్పోరేషన్ ఎన్నికల వేళ ఏ మలుపు తీసుకుంటాయో అన్న చర్చ మృనడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news