తెలంగాణ జానపదానికి అబ్బురపడని వారు ఎవరూ ఉండరు. యూట్యూబ్ విస్తరణ బాగా పెరిగిన తర్వాత జానపదానికి డిమాండ్ బాగా పెరిగింది. తెలంగాణ యాసలో ఎన్నో పాటలు వచ్చాయి. ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. అలా ఆకట్టుకోవడానికి సాత్త్విక స్టూడియో వారు అచ్చమైన వరంగల్ జానపదాన్ని మన ముందుకు తీసుకువచ్చారు.
వరంగల్ జిల్ల పిల్ల అంటూ సాగే ఈ పాట ఈ రోజే యూట్యూబ్ లో రిలీజైంది. ఆకట్టుకునే సంగీతంతో ఉన్న ఈ పాట వినగానే పెదాలపై ఆడేలా అద్భుతంగా ఉంది. వరంగల్ జిల్ల పిల్ల మస్తుగుందిరో, మానుకోట బావా ముగ్గులోకి దింపమాకురో అంటూ బావ మరదళ్ళ సరసాన్ని ఆసక్తికరంగా చూపించారు. హంసవంటి నడక కలదానా అంటూ అమ్మాయి అందాన్ని పొగుడుతూ ఉంటే, సింగిడిలో రంగులన్నీ తెచ్చియ్యవా బావా అంటూ అమాయకంగా అడిగిన మరదలు అలక చూడముచ్చటగా ఉంది.
చక్కని పాటకి అందమైన స్టెప్పులు వేస్తూ పాటని మరింత రసవత్తరంగా చేసారు. సుకుమార్, స్వాతి అభినయం చూడముచ్చటగా ఉంది. ముఖ్యంగా స్వాతి పాటలో ఇమిడిపోయిందనే చెప్పాలి. సాత్త్విక స్టూడియో బ్యానర్ పై నిర్మితమైన ఈ పాటకి మహేష్ నిర్మాతగా ఉన్నాడు. ఈ పాటకి సాహిత్యాన్ని బనోత్ దేవేందర్ నాయక్ అందించారు. సంగీతం భాస్కర్ అప్పళ్ళ చేయగా, వాగ్దేవి శర్మ, నాగ భాస్కర్ ఆలపించారు. దాసు శివ ఈ పాటకి దర్శకత్వం వహించగా, శివ ఎల్ డి కెమెరా వర్క్ చేసారు. తెలంగాణ జానపదాలని ఇష్టపడేవారి ప్లే లిస్ట్ లో ఖచ్చితంగా ఉండాల్సిన పాట వరంగల్ జిల్ల పిల్ల పాట. ఆలస్యమెందుకు మరి వెంతనే చూసేయండి.