వరంగల్ ఎన్నికలు వాయిదా…?

-

వరంగల్ లో కరోనా తీవ్రత చాలా అధికంగా ఉంది. కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నా మరణాలు పెరుగుతున్నాయి. ఎంజీఎంలో మరణమృదంగం కొనసాగుతూనే ఉంది. 21 గంటల వ్యవధిలోనే ఎంజీఎంలో కరోనాతో 27 మంది మృతి చెందారని అధికారులు చెప్తున్నారు. కరోనా మరణాలతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల నేపథ్యంలో ఇంకా ఎక్కువ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడురు మండలం గుండంరాజుపల్లిలో కరోనా పంజా విసిరింది. వారంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గ్రామంలో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. హెల్త్ క్యాంప్ పెట్టాలని అక్కడి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నేటి నుంచి మే5 వరకు….వారం రోజులపాటు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనితో ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news