పదో తరగతి పరిక్షలు ఆపే సమస్యే లేదు: జగన్

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరిక్షలకు సంబంధించి సిఎం వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. పదో తరగతి పరీక్షలను ఆపే సమస్యే లేదని అన్నారు. పరీక్షలను రద్దు చేయాలని అడగడం సులభమే అని, కాని విద్యార్ధుల భవిష్యత్తు దెబ్బ తింటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సర్టిఫికేట్ లో పాస్ అని ఇస్తే ఏ కాలేజీలో జాయిన్ చేసుకుంటారని ఆయన నిలదీశారు.

విద్యార్ధుల భవిష్యత్తు దృష్ట్యా పరీక్షలను నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. తాజాగా వసతి దీవెన కార్యక్రమం ప్రారంభం సందర్భంగా జగన్ ఈ వ్యాఖ్యలు చేసారు. పేద విద్యార్ధులకు చదువే పెద్ద ఆస్తి అని జగన్ వెల్లడించారు. కరోనాతో విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం అయిందని తెలిపారు. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరిక్షల నిర్వహణపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.