మహేంద్ర సింగ్ ధోని అంటే.. క్రికెట్ చరిత్రలో గొప్ప వ్యక్తిగా కీర్తిస్తారు. ధోనిని మిస్టర్ కూల్ అని కూడా పిలుస్తారు. ధోని ఎలాంటి వివాదాలకు దూరంగా ఉంటాడు. అలాగే క్లీష్టమైన పరిస్థితుల్లో కూడా కూల్ గా వ్యవహరిస్తాడు. అయితే తాజా గా ధోనిపై రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ మాజీ పర్ఫామెన్స్ అనలిస్ట్ కోచ్ అఘోరామ్ తీవ్ర ఆరోపణలు చేశాడు. 2016 ఐపీఎల్ సీజన్ లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ గా ధోని ఉన్నాడని అన్నాడు. అయితే అదే సమయంలో తాను కూడా పూణే జట్టుకు పర్ఫామెన్స్ అనలిస్ట్ కోచ్ గా వ్యవహరించానని అఘోరామ్ అన్నాడు.
అయితే ధోనిని మొదటి సారి కలిసినప్పుడు తాను ఆశ్చర్యానికి గురి అయ్యానని అన్నాడు. తనతో జట్టు ప్రణాళికలు, వ్యూహాలపై చర్చ జరిగినప్పుడు.. తనకు ధోని వార్నింగ్ ఇచ్చాడని ఆరోపించాడు. తనతో ధోని… అడగనితే సలహాలు ఇవ్వొద్దని అన్నారని ఆరోపిచారు. అలాగే మీటింగ్ కు కూడా రావాలని పిలవకండి అని ధోని అన్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే ధోని లాంటి వ్యక్తిపై ఈ ఆరోపణలు చేయడంతో సర్వత్ర చర్చ జరుగుతుంది.