టీనేజ్ పిల్లలకు లైఫ్ స్టైల్ ఇలా ఉంటే.. ఇక భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావట..!

-

టీనేజ్ లో ఏదిపడితే అది తింటారు. లైఫ్ ఏంటి అనేది ఆ ఏజ్ లో అస్సలు తెలియదు. మనసుకు ఏది అనిపిస్తే అది చేసేయడం, కనిపించిన ఫుడ్ లాగించేయడం. ప్రతి మనిషికి టీనేజ్ లైఫ్ చాలా బాగుంటుంది. అసలు అప్పుడు అంత ఎంజాయ్ చేశాం అని ఆ ఏజ్ లో తెలియదు. చదువు అయిపోయి జాబ్ చేసే టైంలో అర్థమవుతుంది. లైఫ్ అంటే అదిరా అసలు.. ఫేక్ ఫ్రెండ్స్ ఉండరు, భరించలేని బాధ్యతలు ఉండవు, లైఫ్ ఏంటి, సంపాదన ఏంటి అనే ఆలోచనలు ఉండదు.. అయితే ఈ వయసులో అన్నీ తినొచ్చు కానీ.. వాటితో పాటు.. హార్మోన్స్ రిలీజ్ అయ్యే ఆహారం కూడా తీసుకోవాలి. ఈ ఏజ్ లోనే ఆడవారికి, మగవారికి చాలా హార్మోన్స్ డవలప్ అవుతాయి.

13-19 ఏజ్ లోనే ధైరాయిడ్ వచ్చేది, కంటిచూపు పోయేది ఇక్కడే. ఇక ఈ ఏజ్ నుంచి ఆటలు కూడా తగ్గిస్తారు. తెలివితేటలు పెరుగుతాయి. సర్కిల్ డవలప్ అవుతుంది. చాలా తేడాలు వస్తాయి. ఒబిసిటీ స్టాట్ అవుతుంది. అమ్మాయిలకు పిరియడ్స్ లో పెయిన్స్ స్టాట్ అవుతుంది. మెటిమలు, మెఖాలమీద మచ్చలు వస్తాయి. వాటిని గిల్లకూడదు అని కూడా చాలామందికి ఫస్ట్ తెలియదు. గిల్లేసి ముఖం అంతా పాడుచేసుకుంటారు. స్కిన్ అందం పోతుంది. ముఖం రూపం చెడిపోయేది, మంచి రూపం వచ్చేది కూడా ఈ ఏజ్ లోనే. మరీ ఈ ఏజ్ పిల్లలు డైలీ రొటీన్ ఎలా ఉంటే బాగుంటుంది.

టీనేజ్ పిల్లలు డైలీ వ్యాయామాలు చేయమంటే అస్సలు వినరు. ఆటలు ఆడుకోవడం మాత్రం కంపల్సరీ చేయాలి. ఇక ఆహారం విషయంలో కంటి చూపును మెరుగు చేయడానికి ఉదయం క్యారెట్లు, మునగఆకు, టమాటా, బీట్ రూట్, క్యారెట్ , కీరా వేసి కొద్దిగా గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి తేనె, ఎండుఖర్జూరం పొడి కలిపి ఇస్తే జ్యూస్ తాగేస్తారు. కంటికి కూడా చాలా మంచిది. పాలు ఇస్తుంటారు. అసలు పాలు బలవంతంగా తాగించాల్సిన అవసరం లేదు. వారానికి ఐదు రోజుల పాటు ఈ జ్యూస్ ఇవ్వాలి. కొబ్బరి కలిపి, నానపెట్టిన వేరుశనగ పప్పులు, ఖర్జూరం పళ్లు ఇస్తే బ్రేక్ ఫాస్ట్ సెట్.. చక్కగా తింటారు.

ఒకవేళ పిల్లలు ఇలా తినడం లేదంటే.. ఉడకపెట్టి గుగ్గీల్లులా ఇవ్వొచ్చు. ఇక వీకెండ్స్ లో దోశలు, ఇడ్లీ, పూరీలు పెట్టొచ్చు. తెల్లటి అన్నం పెట్టకుండా.. మిల్లెట్స్ రైస్ పెట్టడం చాలా మంచిది. అన్నం వండేప్పుడు సోయాగింజలు, రాజ్మా గింజలు నానపెట్టి అన్నంలో కలిపి వండి మధ్యాహ్నం పెట్టడం వల్ల చాలా పోషకాలు అందుతాయి. ఒక కర్రీ, ఆకుకూరలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. నిల్వ పచ్చళ్లను డైలీ తినకూడదు. ఎప్పుడో వారానికి ఒకసారి అయితే ప్రాబ్లమ్ ఉండదు. వెజిటబుల్ కూరలో ప్రతీది వండాలి. మా పిల్లలు తినరూ అని మానకూడదు. వారానికి ఐదురోజులు మనం పెట్టింది తినాలి.. వీకెండ్స్ లో వాళ్లకు నచ్చినవి పెట్టాలి..ఇలా ఉంటే.. మనం ఆ ఐదు రోజులు ఏం వండినా తింటారు. కొబ్బరిపాలు పోసి వండితే..ఏ కూరైన టేస్టిగా ఉంటుంది. తెలివితేటలకు కొబ్బరిపాలు చాలా మంచిది.

పిల్లలకు ఈ ఏజ్ లో బ్యాలెన్స్ గా బాడీ ఉండాలంటే.. 50 శాతం అన్నం 50 శాతం కూర తీసుుకునే కాన్సప్ట్ ను బాగా అలవాటు చేయాలి. లంచ్ తిన్నాక ఒక రోజు డ్రై ఫ్రూట్స్ లడ్డూ, ఒకరోజు అవిసె గింజల లడ్డూ, ఒక రోజు పల్లీల లడ్డూ ఇలా వివిధ రకాల లడ్డూను ఖర్జూరంతో చేసినవి ఇవ్వండి.

సాయంకాలం స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అందరూ స్నాక్స్ ఇస్తుంటారు. అసలు ఇలా అలవాటు చేయకూడదు. ఆటైంలో చెరుకురసం/ బత్తాయి రసం/ కమలా రసం లాంటివి ఇవ్వండి. తాగాక గంటపాటు ఆడుకోనివ్వండి. ఆ తర్వాత గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, బాదంపప్పు, పొద్దుతిరుగుడు గింజలు నానపెట్టి.. ఖర్జూరంతో తిని.. అరటిపళ్లు, జామకాయ, సపోటాలు ఐదు రోజుల పాటు పెడితే.. హెల్తీ డిన్నర్ అవుతుంది. ఇవన్నీ కొనడం కష్టం అనుకునే వారు.. ఎర్లీగా డిన్నర్ పెట్టేయండి. ఇలా చేయడం వల్ల అన్నీ పోషకాలు వెళ్తాయి, తెలివితేటలు పెరుగుతాయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది.

ఇక ఏజ్ వాళ్లకు కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డైలీ పిల్లలతో స్కూల్ నుంచి రాగానే ఒక గంటపాటైన సరదాగా గడిపేందుకు పేరెంట్స్ ట్రై చేయాలి. అప్పుడే వారికి అన్నీ చెప్పుకునే ఫ్రీడమ్ వస్తుంది. మార్కులు తక్కువ వచ్చినా భయపడకుండా చెప్తారు. తిట్టడం, కొట్టడం కాకుండా.. వారికి కౌన్సిలింగ్ ఇస్తే.. వారు లైఫ్ లో ఏ విషయాన్ని అయినా దాచకుండా మీతో పంచుకుంటారు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news