డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు తో షాపింగ్ చేస్తున్న వారికి హెచ్చరిక..

-

డెబిట్ కార్డు, క్రెడిట్ ద్వారా బిల్ చెల్లిస్తున్న వారి డేటాను దొంగతనం జరగకుండా ఉండేందుకు ఆర్బీఐ కొత్త నిర్ణయాలను తీసుకుంటూ వస్తూంది..వినియోగ దారుల వివరాలను గొప్యంగా ఉంచెందుకు టోకనైజేషన్ విధానాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే..ఆ సమయంలో ఈ విధానం అమలుకు జూన్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించింది. వ్యాపారులు, బ్యాంకులు, పేమెంట్ అగ్రిగేటర్లు సన్నద్ధత వ్యక్తం చేయకపోవడంతో గడువు తేదీని 2021 డిసెబర్ 31కి పొడిగించారు.

మళ్లీ గడువు పొడిగించాలన్న వినతులు ఆయా వర్గాల నుంచి రావడంతో ఈ జూన్ 30 వరకు పొడిగించింది ఆర్బీఐ. తాజాగా గడువును మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ల నుంచి వస్తువులను కొనుగోలు చేసినప్పుడల్లా లేదా ట్రావెల్ వెబ్‌సైట్ ద్వారా రైలు లేదా విమాన టిక్కెట్‌లను బుక్ చేసినప్పుడల్లా, ఫ్యూచర్‌ ట్రాన్సాక్షన్‌లు సులభంగా జరిగేందుకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ వివరాలను సేవ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చేసే పేమెంట్స్‌కు కేవలం మూడు అంకెల CVV నంబర్‌ను మాత్రమే నమోదు చేస్తే, పేమెంట్‌ చెక్అవుట్‌ను సెకన్లలోపు చేస్తారు. ఇప్పుడు కాదు..పూర్తీ సమాచారాన్ని పొందు పరచాలి.

ఈ టోకెన్ ఒక కార్డుకు, ఒక మర్చెంట్‌కు ఒకేసారి ఉపయోగపడుతుంది. ఈ టోకెన్, కార్డ్ వివరాలను పూర్తిగా అందించదు. కాబట్టి మర్చంట్ వెబ్‌సైట్ నుంచి డేటా లీక్ అయినా, హ్యాకర్‌ కార్డ్ వివరాలను దుర్వినియోగం చేయలేడు. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్, మొబైల్ పాయింట్ ఆఫ్ సేల్ లావాదేవీలు లేదా యాప్‌లో లావాదేవీల కోసం టోకెన్‌లను ఉపయోగించవచ్చు..కార్డ్ వినియోగదారులు షాపింగ్ వెబ్‌సైట్‌లో వస్తువును కొనుగోలు చేసే ముందు టోకెన్‌ను తయారు చేసి, నిర్దిష్ట వెబ్‌సైట్‌లో షాపింగ్ తర్వాత చెల్లింపు సమయంలో సేవ్ చేయాలి.

కస్టమర్‌లు తమ కార్డ్‌లను మర్చంట్ వెబ్‌సైట్‌లో టోకనైజ్ చేయాలా వద్దా అని ఎంచుకోవచ్చు. అలాంటప్పుడు, కస్టమర్ ఏదైనా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేటప్పుడు 16-అంకెల కార్డ్ నంబర్, గడువు తేదీ, CVV సహా ప్రతి లావాదేవీకి కార్డ్ వివరాలను మళ్లీ మళ్లీ నమోదు చేయాలి. కార్డ్ వివరాలు Flipkart, Amazon, Myntra మొదలైన వెబ్‌సైట్‌లలో స్టోర్‌ కావు. ఆన్‌లైన్‌లో ఏదైనా కొనుగోలు చేసిన ప్రతిసారీ కార్డ్‌ని టోకనైజ్ చేసి, టోకెన్‌ని స్టోర్ చేసుకునేలా సెలక్ట్‌ చేసుకోవచ్చు..ఇలా చేయడం వల్ల డేటా చొరీకి గురికాదు..ఇది తప్పక గమనించాలి.

Read more RELATED
Recommended to you

Latest news