తెలుగు సినీ ఇండస్ట్రీలోకి యువకుడు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల మదిని దోచుకున్న ఈ ముంబై ముద్దుగుమ్మ తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ చిత్రాల్లో కూడా నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. 2003లో వచ్చిన ఈ చిత్రానికి గాను నంది అవార్డులు సైతం సొంతం చేసుకున్న భూమిక ఆ తర్వాత ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది అని చెప్పవచ్చు. ఇక సినీ ఇండస్ట్రీలోకి రాకముందు పాండ్స్ పౌడర్ ప్రకటనలో కనిపించిన భూమిక.. ఆ తర్వాత సినిమా అవకాశాలు తలుపు తట్టాయి. ఇక తన అందం, అభినయానికి అదృష్టం కూడా తోడయ్యి స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇక 2001లో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన ఖుషి సినిమా ద్వారా ఓవర్ నైట్ లో ని స్టార్ హీరోయిన్ గా అవకాశాన్ని పొందింది ఈ ముద్దుగుమ్మ.
ఇక బాలీవుడ్ లో ఈమె నటించిన సినిమాల విషయానికి వస్తే.. 2003లో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన తేరే నామ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక ఆ తర్వాత 2007లో ఆధ్యాత్మిక గురువైన భరత్ ఠాకూర్ ను వివాహం చేసుకుంది. ఇక ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తన వైవాహిక జీవితంలో సంతోషంగా జీవిస్తోందని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా తాజాగా భూమికా పై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు. ఇటీవల ఆయన ఆలీతో సరదాగా అనే ప్రోగ్రాం కి తన కొడుకు హీరో అశ్విన్ తో కలిసి షో కి హాజరయ్యారు. ఇక ఇటీవల ఎమ్మెస్ రాజు నిర్మాణ సారథ్యంలో అశ్విన్ హీరోగా తెరకెక్కిన 7 డేస్ 6 నైట్స్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ షో కి హాజరైనట్లు సమాచారం.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెస్ రాజు సినిమా గురించి చెబుతూనే భూమిక గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబు హీరోగా.. భూమిక హీరోయిన్ గా ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో తెరకెక్కిన చిత్రం ఒక్కడు. ఒక్కడు సినిమా షూటింగ్ సమయంలో భూమిక ప్రవర్తన చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారట.
ఇక భూమిక , మహేష్ బాబు, ఎంఎస్ రాజు ఒక దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉండగా.. సడన్గా అక్కడికి వచ్చిన ఒక ఫైటర్ పై భూమిక బూతులతో విరుచుకుపడినట్లు ఎమ్మెస్ రాజు తెలిపారు. అయితే ఆ మాటలు అర్థం కాని ఇంగ్లీష్ లో ఆమె మాట్లాడిందని చెప్పుకొచ్చారు. అందరం కొద్దిసేపు ఏం జరిగిందో అర్థం కాలేదు అంటూ చెప్పుకొచ్చారు.