దేవీశ్రీ: పూనకాలు లోడింగ్ సాంగ్ లో సీక్రెట్ ఉంది..!!

-

బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య’  చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు..సంక్రాంతి పండుగ సందర్భంగా  ఈ సినిమా 13  రిలీజ్ ని అనౌన్స్ చేశారు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మైత్రి మూవీ మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచడానికి రెడీ అయ్యారు.

ఈప్రమోషన్స్ కూడా సూపర్ ల్లెవెల్లో ప్లాన్ చేస్తున్నారట. వాల్తేరు వీరయ్య నుంచి వచ్చిన బాస్ పార్టీ, చిరంజీవి శ్రీదేవీ పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రీసెంట్ గా వీరయ్య టైటిల్ సాంగ్ కూడా వ్యూస్ కొల్లగొడుతోంది. యూట్యూబ్ లో తమన్ సంగీతం అందించిన బాలయ్య సినిమా సాంగ్స్ కంటే దేవీశ్రీ మ్యూజిక్ అందించిన చిరు సినిమాకే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. దానితో దేవీశ్రీ ప్రసాద్ హ్యాపీ గా ఉన్నాడు.

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో పూనకాలు లోడింగ్ సాంగ్ సీక్రెట్ రివిల్ చేసాడు. దేవి మాట్లాడుతూ నేను వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వెళ్లినా అక్కడి మ్యూజిక్ పరికరాలు కొంటా ఉంటాను అని తెలిపారు. అందులో భాగంగా గోవా కి ఒక షాప్ కి వెళ్ళినప్పుడు ఒక టాయ్ ను చూసా అని, అది పూనకాలు లోడింగ్ సాంగ్ కి ఉపయోగించినట్లు తెలిపారు. ప్రీ రిలీజ్ వేడుక లో దాన్ని అందరికీ చూపిస్తా అంటూ చెప్పుకొచ్చారు దేవి శ్రీ ప్రసాద్.

 

Read more RELATED
Recommended to you

Latest news