‘ఫైటర్’ కోసం సరికొత్త ఫీట్ చేయబోతున్న రౌడీ హీరో…!!

-

టాలీవుడ్ యంగ్ సెన్సషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అతి త్వరలో ఒక సినిమా మొదలు కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ కొట్టి ఊపు మీదున్న పూరి, విజయ్ కోసం ఒక అద్భుతమైన స్టోరీ లైన్ ని రెడీ చేసాడట. పూరి మార్క్ డైలాగ్స్, స్టైల్, తో పాటు ఫుల్ మాస్, యాక్షన్ తో ఈ సినిమా సాగనున్నట్లు టాక్. ఇక నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం,

ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తన కెరీర్ లోనే తొలిసారిగా ఫుల్ యాక్షన్ హీరోగా దర్శనం ఇవ్వనున్నాడట. అందుకోసమే తన బాడీని మరియు స్టైల్ ని మరింత రఫ్ గా కనపడేలా మార్చుకుంటున్నాడట. పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ మరియు ఛార్మి కలిసి నిర్మించబోయే ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించనున్నారు. అలానే ఈ సినిమా కోసం ఒక యువ నటిని కూడా పూరి సంప్రదించారని, ఆమె ఎవరు అనేది మరికొద్దిరోజుల్లో వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.

 

కాగా ఈ సినిమా కథను ఇటీవల తన ఫేవరెట్ స్పాట్ అయిన బ్యాంకాక్ వెళ్లి రాసుకుని వచ్చిన పూరి, సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నాడట. ఇక గత రెండు సినిమాలైన నోటా, డియర్ కామ్రేడ్ తో కాస్త తన ఫ్యాన్స్ ని నిరాశపరిచిన రౌడీ హీరో, తప్పకుండా ఈ మూవీతో ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేయాలని చూస్తున్నాడట. ప్రస్తుతం రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్న విజయ్, అవి పూర్తి కాగానే పూరి సినిమా మొదలెడతాడట. మరి మొదటి సారి డాషింగ్ డైరెక్టర్ తో పని చేస్తున్న రౌడీ హీరో, ఎంతమేర సక్సెస్ ని అందుకుంటాడో చూడాలి…..!!

Read more RELATED
Recommended to you

Latest news