రఫెల్ స్కాం పై సుప్రీం కోర్టులో కేసు వేస్తాం : సీఎం కేసీఆర్

-

ర‌ఫెల్ విమానాలపై కొనుగోలు పై కేంద్ర ప్ర‌భుత్వం నాట‌కాలు ఆడుతుంద‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ విమ‌ర్శించారు. దీనిపై రాహుల్ గాంధీ మాట్లాడితే.. అంత దారుణంగా మాట్లాడుతారా అని ప్ర‌శ్నింమ‌చారు. బీజేపీ సంస్కారం అలాంటిదేనా అని అన్నారు. రాహుల్ గాంధీ.. ఒక ఎంపీని తండ్రి ఎవ‌రూ అని వ్యాఖ్యానిస్తారా అని ప్ర‌శ్నిచారు. ఫ్రాన్స్ నుంచి భార‌త దేశంలో 36 రఫెల్ విమానాలకు 7.87 బిలియ‌న్ డాల‌ర్ల‌ను ఖ‌ర్చు చేసింద‌ని అన్నారు.

ఇటీవ‌ల ఇండోనేషియా దేశం ఇదే ఫ్రాన్స్ దేశంతో 42 ర‌ఫెల్ యుద్ద విమానాల‌ను కొనుగోలు చేసింద‌ని అన్నారు. కేవలం 8.1 బిలియ‌న్ డాల‌ర్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేసింద‌ని అన్నారు. భార‌త్ కన్నా.. 6 ర‌ఫెల్ యుద్ధ విమానాలు ఎక్కువ కొనుగోలు చేసి 0.2 బిలియ‌న్ డాల‌ర్లు మాత్ర‌మే ఎక్కువ ఖ‌ర్చు చేసింద‌ని అన్నారు. ఇది స్కాం కాదా అని ప్ర‌శ్నించారు. దీని పై తాము సుప్రీం కోర్టులో కేసు వేయ‌నున్నట్టు సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఈ స్కాం గురించి దేశ ప్ర‌జ‌ల‌కు తెల‌యాల‌ని అన్నారు. అందుకే సుప్రీం కోర్టులో కేసులు వేస్తున్న‌ట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news