హిజాబ్ గురించ రచ్చ జరగుతూనే ఉంది. కర్ణాటకలో ఉడిపి జిల్లాలో మొదలైన ఈ ఘటన.. దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం పొలిటికల్ వివాదంగా మారింది. కాంగ్రెస్, ఇతర పార్టీలు హిజాబ్ ధరించడం ముస్లిం విద్యార్థినిల హక్కు అని అంటుంటే… బీజేపి పార్టీ విద్యాలయాల్లో అందరికీ ఒకే యూనిఫాంఉండాలని.. విద్యార్థులంతా సమానమే అని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఈ వివాదంపై రాజకీయ నాయకులు వాఖ్యలు చేస్తున్నారు. ఎంఐఎం ఛీఫ్ ఏదో ఒక రోజు నేను బతికున్నా.. లేకపోయినా.. హిజాబ్ ధరించిన వ్యక్తి ప్రధాని అవుతారని వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత జమీర్ అహ్మద్ హుబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ అంటే ఇస్లాంలో ‘పర్దా’…మహిళల అందాన్ని దాచేందుకు హిజాబ్ సహాయపడుతుందని…హిజాబ్ ధరించకపోతే మహిళలు అత్యాచారానికి గురవుతారని.. అత్యాచారాల నుంచి రక్షించుకోవడానికి హిజాబ్ సహాయపడుతుందని ఆయన అన్నారు.