వామ్మో.. మృణాల్ డిమాండ్ మామూలుగా లేదుగా.. నాని సినిమా కోసం అన్ని కోట్లా..?

-

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన ప్రేమ కథ చిత్రం సీతారామం.. ఈ సినిమాతో భారీ పాపులారిటీని అందుకున్న మృణాల్ ఠాకూర్.. ఎక్కడ చూసినా ఈమె పేరు వినిపిస్తూ వుంది. ప్రస్తుతం నాని నటిస్తున్న తన 30వ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికయింది ఈ ముద్దుగుమ్మ. దసరా సినిమా పూర్తి అయిన వెంటనే శౌర్యవ్ దర్శకత్వంలో ఒక సినిమాను వైరా ప్రొడక్షన్ లో నాని చేయబోతున్నట్లుగా కొత్త సంవత్సరం సందర్భంగా అధికారిక ప్రకటన వచ్చింది.

నాని లుక్ విషయంలో స్పష్టత వచ్చింది. దసరా సినిమా తర్వాత తన లుక్ ను పూర్తిగా మార్చబోతున్నట్లుగా కూడా నాని తెలియజేశారు. ఇక ఈ సినిమాలో నానికి జోడిగా సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాగూర్ నటించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. సీతారామం సినిమాతో భారీ క్రేజ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు ఎన్నో సినిమాలలో ఆఫర్లు వచ్చాయి. కానీ ఆమె మాత్రం ఆలోచించి కథ ఎంపిక విషయంలో సంతృప్తి చెందిన తర్వాతే.. నాని 30వ సినిమాకు ఓకే చెప్పింది అంటూ సమాచారం.

తెలుగులో మృణాల్ కి ఇది రెండవ సినిమానే అయినా ఏకంగా కోటి రూపాయల పారితోషకమును ఆమె డిమాండ్ చేసిందట. అయితే ఆమెకున్న క్రేజ్ కారణంగా నిర్మాతలు కూడా ఆమెకు ఆ పారితోషకం ఇవ్వడానికి సిద్ధమయ్యారని సమాచారం. నాని 30వ సినిమా హిట్ అయితే కనుక మృణాల్ కు మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. ఇకపోతే తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో కూడా ఈమెకు మరింత పాపులారిటీ ఉంది. కాబట్టి నాని సినిమాలో ఈమె మంచి ఛాయిస్ అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ జోడిని త్వరలోనే థియేటర్లలో చూస్తే బాగుంటుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news