కోడిని చూసి వీటిని నేర్చుకుంటే జీవితం బాగుంటుంది..!

-

ఆచార్య చాణక్య జీవితం లో జరిగే ఎన్నో విషయాల గురించి చెప్పారు. చాణక్య చెప్పినవి ఆచరిస్తే సమస్యలేమీ వుండవు. చాణక్య నిరంతరం సానుకూలంగా ఉండాలని అంటున్నారు. ఎప్పుడు నిరంతరం సానుకూలంగా ఉండడమే ముఖ్యమని అంటున్నారు. అయితే మన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వాటిని జాగ్రత్తగా పరిష్కరించుకుంటే సరిపోతుంది.

ఆచార్య చాణక్య చాణక్య నీతి ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలని చెప్పారు కోడి ద్వారా కూడా మనిషి వీటిని నేర్చుకోవచ్చని వీటి వలన మనిషి ఆనందంగా ఉండేందుకు అవుతుందని… ఓటమి ఎదురవదని.. ఈ మంచి లక్షణాలను అలవాటు చేసుకుంటే జీవితం బాగుంటుందని అన్నారు. మరి కోడి నుండి ఎటువంటి విషయాలని నేర్చుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం.

పోరాడడం:

కోడి ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటుంది శత్రువులని ఈజీగా పసిగడుతుంది. యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది అసలు వెనక్కి తగ్గదు. అలానే మనం సంక్షోభం వచ్చినప్పుడు దృఢంగా ఎదుర్కొంటే కచ్చితంగా విజయం సాధిస్తారని చాణక్య చెప్పారు.

కష్టపడడం:

కోడి ఎప్పుడు కూడా కష్టపడుతుంది కోడిలానే మనిషి కూడా కష్టపడితే జీవితంలోఆనందాన్ని, గౌరవాన్ని పొందొచ్చు హాయిగా ఉండొచ్చు.

మరొకరి మీద ఆధారపడకూడదు:

మరొకరి మీద కోడి ఆధారపడదు. అలానే మనం కూడా ఇతరుల మీద ఆధారపడకుండా ఉంటే జీవితం బాగుంటుందని చాణక్య అన్నారు.

దురాశ:

కోడి ఎప్పుడు కూడా వాళ్ళ సమూహంతో ఆహారాన్ని పంచుకుంటుంది అలానే మనుషులు కూడా కుటుంబంతో అన్నిటినీ పంచుకోవాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news