మనిషి నిద్రలో ఉన్నప్పుడు కలలు కనడం సహజం. కానీ ఆ వచ్చే కలలకు భవిష్యత్తుకు ఏదో సంబంధం ఉంటుంది అనేది.. పండితులు మాట. మన మానసిక పరిస్థితి ఎలా ఉందో.. దాన్ని బట్టే కలలు వస్తాయి అంటారు సైన్స్ నిపుణులు. ఏది ఏమైనా కానీ.. కలలు రావడం అనేది సంకేతమే. లైట్ తీసుకునే అంత సింపుల్ విషయం కాదు. మనకు వచ్చే కొన్ని కలలు వల్ల మన మెంటల్ స్టేటస్ ఏంది అనేది కూడా తెలుసుకోవచ్చు కదా..! ఈరోజు మనం కొన్ని కలలో వచ్చే సంఘటనలు వాటికి అర్థాలు చూద్దాం.
ఒకరిని వెంబడించడం.. ఎవరైనా మిమ్మల్ని వెంబడిస్తున్నారని మీరు కలలుగన్నట్లయితే, మీరు ఏదైనా సమస్యను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారని లేదా మీకు హాని కలిగించే వ్యక్తిని నివారించడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం.
భయం.. మీరు కలలో భయపడితే.. పరిస్థితి మీ నియంత్రణలో లేదని అర్థం.
పాఠశాలలో ఉండడం.. ఇలాంటి కలలు వస్తే.. మీరు సమస్యలను పరిష్కరించలేదని అర్థం. మీ అంచనాలకు తగినట్టుగా మీ జీవితం లేదని.. మీ జీవితంలోకి వచ్చే ముఖ్యమైన వాటికి మీరు సిద్ధంగా లేరని అర్థం.
చనిపోయిన వ్యక్తిని చూడడం.. కలలో చనిపోయిన వ్యక్తి రావడమనేది.. అతని గురించి మీరు ఏమనుకుంటున్నారో అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తి మీకు ప్రియమైన వ్యక్తి అయితే మీరు ఇంకా దుఃఖంలోనే ఉన్నారని అర్థం. కలలు భయానకంగా లేదా బాధించేవిగా ఉంటే.. మీరు ఇప్పటికీ ఆ భావాలను అనుభవిస్తున్నారని అర్థం
ఆలస్యంగా రావడం.. రైలు, విమానం, బస్సులో గుంపులో చిక్కుకోవడం లాంటి కలలు వస్తే.. మంచి అవకాశాన్ని కోల్పోయిందని సంకేతం. ఇది అంచనాలను అందుకోలేని భయం.. అసాధారణ అభద్రతకు సంబంధించినది.
పని ఒత్తిడి.. ఇటువంటి కలలు వాస్తవానికి వృత్తిపరమైన పరిస్థితికి సంబంధించిన ఆందోళనను సూచిస్తాయి. మీ పనిలో వైఫల్యం, అందుకు సంబంధించిన గడువు, ఆందోళన చెందుతున్నారని అర్థం.
దంతాల నష్టం.. దంతాల నష్టం, ఫ్రాక్ఛర్, ఇతర ఆరోగ్య సమస్యల అనుభవాలు ఎప్పుడూ మీ వ్యక్తిగత నష్టాన్ని సూచిస్తుంది. ఇది జీవితంలో రాబోయే మార్పులు.. ఆందోళనకు సంకేతం.
సో.. ఇది మాటర్… అయితే స్వప్నశాస్త్రం ప్రకారం.. పండితులు చెప్పినవి మీకు అందించాం తప్ప.. మనలోకం సొంతగా అనుకోని రాసింది కాదు.. ఇలాంటివి నమ్మని వాళ్లు.. ఏంట్రా ఈ న్యూస్.. మారరా అంటూ నిట్టూరుస్తారు.. కొందరికి ఇలాంటి వాటిపై నమ్మకం ఉంటుంది. తప్పులేదు. ఆ పాఠకులు ఆస్తికిని దృష్టిలో పెట్టుకోని రాయడం జరిగిందని గమనించగలరు. నమ్మకం లేదంటే.. లైట్ తీసుకుని లాగించేయండి బాస్..!
-Triveni Buskarowthu