అలీబాబా అధినేత జాక్ మా ఏమయ్యాడు ?

-

చైనాకు చెందిన అపర కుబేరుడు జాక్ మా అదృశ్యమయ్యాడు. వ్యాపారవేత్త, అలీబాబా వ్యవస్థాపకుడైన జాక్ మా రెండు నెలల నుంచి కనిపించడం లేదు. చైనా ప్రభుత్వంతో తలెత్తిన వివాదమే అతని అదృశ్యానికి కారణమని తెలుస్తోంది. గతేడాది అక్టోబర్‌ లో షాంఘైలో జరిగిన ఒక కార్యక్రమంలో చైనా ప్రభుత్వ ఆర్థిక సంస్కరణలపై తీవ్ర విమర్శలు చేశారు జాక్ మా. అప్పటి నుంచి ఆయన వ్యాపారాలు నష్టపోతూనే ఉన్నాయి. అసలు జాక్ మా ఏమయ్యాడు…

ప్రముఖ టాలెంట్ షో ఆఫ్రికా బిజినెస్ హీరోస్ ఫైనల్లో జాక్ మా జడ్జిగా పాల్గొనాల్సి ఉంది. అయితే ఆ షో నిర్వాహకులు తయ వెబ్‌ సైట్‌ నుంచి జాక్ మా ఫొటోలను తొలగించారు. దీంతో జాక్ మా ఏ మయ్యారనేది మిస్టరీగా మారింది. ఏ విషయమైనా చాలా రహస్యంగా జరిగే చైనాలో… ప్రస్తుతం నడుతున్న అంతుచిక్కని పరిణామాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తే వాళ్లలో జాక్ మా కూడా ఒకరు. ఈ క్రమంలోనే చైనా తీసుకొచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్కరణలపై జాక్ మా విమర్శలు చేశారు. ఆ సంస్కరణలు అవి వృద్ధ విధానాలని, వాటి వల్ల వివిధ వ్యాపార నష్టపోతాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు జాక్ మా.

యాంట్, అలీబాబా సంస్థల అధిపతిగా జాక్ మా… చైనాలో అత్యధిక సంపద గల వాళ్లలో రెండో స్థానంలో ఉన్నారు. చైనా ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేసిన జాక్ మా… అక్కడి బ్యాంకింగ్ విధానాలపై మండిపడ్డారు. బ్యాంకుల్లో సంస్కరణలు తేవడం లేదని, బ్యాంకులను తాకట్టు దుకాణాల్లా నడుపుతున్నారని ఆరోపించారు. తర్వాత సీన్ మారిపోయింది. భారత కరెన్సీ ప్రకారం ఆయన సంస్థలు ఈ మధ్య కాలంలో 83వేల కోట్ల రూపాయలు నష్టపోయాయి. అలాగే జాక్‌ మా సంస్థ యాంట్ గ్రూప్‌ కు దక్కాల్సిన ఓ పబ్లిక్‌ ప్రాజెక్టును చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆదేశాలతో నిలిపివేశారు బీజింగ్ అధికారులు.

జాక్ మా దాదాపు రెండు నెలలుగా కనిపించకుండా పోవడం కార్పొరేట్ ప్రపంచంలో సంచలనంగా మారింది. ముందే షెడ్యూలైన కార్యక్రమాల్లో ఆయన పాల్గొనకపోవటంపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దీని వెనుక చైనా ప్రభుత్వ హస్తం ఉందేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన జాక్‌ మా, దేశంలోనే అత్యంత కీలక వ్యక్తిగా ఎదిగాడు. చైనా అధ్యక్షుడి తర్వాత అంతటి కీలక వ్యక్తిగా జాక్‌ మా కు పేరొచ్చింది. జాక్‌ మా సంపద వేల కోట్లు తగ్గినా, సంపన్నుడిగా స్థానం మాత్రం తగ్గలేదు.

భారత్‌ లో పేటీఎమ్, స్నాప్‌ డీల్‌ , బిగ్‌ బాస్కెట్‌ సంస్థల్లో కూడా జాక్ మా పెట్టుబడులు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయాలతో జాక్‌ మా ఆస్తులు కరిగినా, ఇప్పటికీ ప్రపంచం లో 20 వ అత్యంత ధనవంతుడుగా, చైనాలో టాక్‌ లిస్టులోనే ఉన్నాడు జాక్ మా.

Read more RELATED
Recommended to you

Latest news