ఫిలిం జర్నలిస్టుపై రెచ్చిపోతూ దారుణ ట్వీట్లు చేసిన బండ్ల గణేష్.. ఏమైందంటే..?

-

ప్రముఖ నటుడు, నిర్మాత , హీరో అయిన బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భక్తుడని చెప్పుకుంటూ తిరిగే ఈయన నిజంగానే పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ తనను తాను మరింత ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎప్పటికప్పుడు వివాదాస్పద ట్వీట్ లు చేస్తూ ఉండే బండ్ల గణేష్ ఇప్పుడు తాజాగా ఒక ఫిలిం జర్నలిస్టుని టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్ లు చేయడం సంచలనానికి దారి తీసింది. వాస్తవానికి అటు మీడియా వ్యక్తులను ముఖ్యంగా సీనియర్ జర్నలిస్టులను టార్గెట్ చేయాలని ఎవరు అనుకోరు. కానీ బండ్ల గణేష్ ఒక సీనియర్ ఫిలిం జర్నలిస్టు ను టార్గెట్ చేస్తూ చేసిన ట్వీట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

ముఖ్యంగా సదరు సీనియర్ జర్నలిస్టు తన పేరుతో కాకుండా ఒక అమ్మాయి పేరుతో అకౌంట్ మైంటైన్ చేస్తూ ఉండడంతో దానిని కూడా ప్రస్తావిస్తూ బండ్ల గణేష్ అనేక ట్వీట్లు చేశారు.. ఇకపోతే నిఖిల్ తో ఇంటర్వ్యూ చేసినట్లు సదరు వ్యక్తి ట్విట్టర్ అకౌంట్లో పేర్కొనగా .. కేవలం నువ్వంటే భయంతో ఇంటర్వ్యూ ఇస్తున్నారు.. లేకపోతే నీకు ఎవరైనా ఇంటర్వ్యూ ఇస్తారా.. నీ మొహం నువ్వు .. అంటూ బండ్ల గణేష్ కామెంట్ చేశాడు. అయితే ఆ ట్వీట్ కి కామెంట్ చేస్తూ ఒకరు.. ఎవరు ఆయన అని అడగ్గా ఆయన పేరు మూర్తి అని.. దేవి ప్రియ అనే పేరుతో ట్వీట్ చేస్తూ ఉంటాడని.. ఆయన ఒక బ్రోకర్ అని బండ్ల గణేష్ దారుణంగా ట్వీట్ చేశాడు.

ప్రతి హీరో పై ఆర్టికల్ రాస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు.. ఈ మూర్తి గాడు వీడిని అంటారు బ్రోకర్.. అని అంటూ బండ్ల గణేష్ కామెంట్ చేశారు. ఆ మూర్తి గాడి ఫోటో ఉంటే పెట్టమంటే.. హిప్పోపొటమస్ సింబల్ పెట్టిన తర్వాత అతని ఫోటో షేర్ చేశాడు.. కళామతల్లి ముద్దుబిడ్డను చూశాము.. తల్లిని నిన్ను నమ్ముకుని ఎదిగిన వాళ్ళని చూశాము.. వీడు మాత్రం కళామతల్లి తల్లికి పుట్టిన చీడపిరుగని పేర్కొన్నారు.. బ్లాక్ మెయిల్ గాడు.. బ్రోకర్ మూర్తి గాడు.. దేవుడి పేరు చెప్పి అందరినీ భయపెడుతుంటాడు..డబ్బులు లాక్కుంటాడు అంటూ రకరకాలుగా ట్వీట్ లు చేసాడు బండ్ల గణేష్ . మొత్తానికి ఈ ట్వీట్లు కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news