మందమర్రి మండలం గుడిపల్లిలో ఆరుగురు సజీవ దహనం కేసులో విస్తుపోయే విషయాలు

-

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లిలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. అర్ధరాత్రి తరువాత రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిపల్లిలోని ఓ గృహంలో పెద్ద ఎత్తున మంటలు చెదరేగి అందులో ఉన్న ఆరుగురు సజీవ దహనం అయ్యారు. గ్రామానికి చెందిన మాసూ శివయ్య, రాజ్యలక్ష్మి, మౌనిక, శాంతయ్య, హిమబిందు, స్వీటీ చనిపోయారు.

ఈ కేసులో దర్యాప్తు జరిపిన పోలీసులు దిగ్భ్రాంతి కలిగించే విషయాలను కనుగొన్నారు. అది అగ్ని ప్రమాదం కాదని.. పక్క ప్లాన్ తోనే చేసిన హత్యగా పోలీసులు గుర్తించారు. ఇంటికి నిప్పు పెట్టేందుకు పెట్రోల్ కొనుగోలు చేసిన ముగ్గురు వ్యక్తులతో పాటు వారికి సహకరించినట్లు భావిస్తున్న మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో ఈ కేసులో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్యాన్ల లో పెట్రోల్ తీసుకొచ్చి శివయ్య ఇంటికి నిప్పంటించారు నిందితులు.

శాంతయ్య ,పద్మలే టార్గెట్ గా దహనానికి పథకం రచించారు. కాని ఆసమయంలో పద్మ భర్త శివయ్య, శివయ్య వదిన కూతురు మౌనిక, ఆమె ఇద్దరు కుమార్తెలు ఇంట్లో ఉన్నారు. ముందుగా డోర్లు, కిటీకిల వద్దనే పెట్రోల్ పోశారు హంతకులు. పెట్రోల్ పోసిన తర్వాత చిన్నారులు ఉన్నారని తెలిసాక సైతం ఆగకుండా నిప్పంటించారు నిందితులు. పెట్రోల్ చల్లడం కోసం వాటర్ బాటిల్ కొనుక్కోని వచ్చి దాన్ని కట్ చేసి దానితో ఇంటిపైన పెట్రోల్ పోసినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడించారు నిందితులు.

ముందుగా ప్లాన్ లో మౌనిక ,ఆమె ఇద్దరు చిన్నారులను చంపాలని లేదని పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం పోలీసుల అదుపులో శాంతయ్య భార్య సృజన,లక్షెట్టిపేటకు చెందిన లక్ష్మణ్ ,రమేష్ ,గుడిపెల్లికి చెందిన సమ్మయ్యతోపాటు మరొక్కరు ఉన్నారు. శివయ్య ఇంటికి నిప్పుపెట్టాక మద్యం తాగివెల్లినట్టు గా గుర్తించారు పోలీసులు. ఆ తరువాత వారు ఓ లాడ్జి లో ఉన్నట్లు గుర్తించారు. పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాల పుటేజ్ స్వాదీనం చేసుకున్నారు పోలీసులు. డబ్బుల ఆఫర్ ఇచ్చి మరీ హత్య చేయాలని ప్లాన్ ఇచ్చినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news