పుష్ప కు అల్లు అర్జున్ పారితోషికం ఎంతంటే?

-

ఇటీవ‌ల విడుద‌ల అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు సృష్టిస్తుంది. కోట్లను వ‌సూల్ చేస్తుంతూ అంద‌రినీ ఆశ్చ‌ర్యప‌రుస్తుంది. అయితే ఈ సినిమాకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీగా రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నార‌ని సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఈ సినిమాకు రూ. 50 కోట్లు రెమ్యూన‌రేష‌న్ తీసుకున్నాడ‌ని తెలుస్తుంది. అలాగే ఈ సినిమా లో హీరోయిన్ గా న‌టించిన ర‌ష్మిక రూ. 8 నుంచి 10 కోట్ల వ‌ర‌కు పారితోషికం గా తీసుకుంద‌ని స‌మాచారం.

అలాగే డైరెక్ట‌ర్ సుకుమార్ కూడా రూ. 25 కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ తీసుకున్నాడ‌ని తెలుస్తుంది. అలాగే మ్మూజిక్ డైరెక్ట‌ర్ దేవి శ్రీ ప్ర‌సాద్ రూ. 3.5 కోట్లు తీసుకున్నాడ‌ని స‌మాచారం. మెయిన్ విల‌న్ గా న‌టించిన‌ ఫ‌హ‌ద్ ఫాజిల్ 3.5 కోట్లు తీసుకున్నార‌ని తెలుస్తుంది. అలాగే ఊ అంటావా.. ఊఊ అంటావా అనే ఐటెం సాంగ్ లో న‌టించిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత కూడా 1.5 కోట్లు పారితోషికం తీసుకుంద‌ని స‌మాచారం. అలాగే యాంకర్ అన‌సూయ కు రోజుకు రూ. 2 ల‌క్షల వ‌ర‌కు ఛార్జ్ చేసింద‌ని స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Latest news