వ్యవసాయంలో మల్చింగ్ అంటే ఏమిటి..ప్రాముఖ్యతలు..?

-

ఉద్యోగాలు చేసినా,వ్యాపారాలు చేసినా కూడా తృప్తి చెందని చాలా మంది వ్యవసాయం వైపు మొగ్గు చూపిస్తున్నారు.70 శాతం మంది వ్య్వసాయాన్ని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.వ్యవసాయంలో అధిక దిగుబడి కోసం రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం పెరిగి నేల, నీరు, వాతావరణం కాలుష్యం పెరిగిపోతోంది. అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగపడే నీటి లభ్యత తగ్గుతోంది. కొన్ని ప్రాంతాల్లో లభ్యత పెరిగినప్పటికీ అధిక ఖర్చుతో కూడుకొన్నది..అందుకే నేలల పరిరక్షణలో మల్చింగ్ అనేది చాలా ముఖ్యమైనది..

ఈ మల్చింగ్ అంటే ఏమిటి?

మల్చింగ్ అంటే మొక్కల వేర్లను దేని సాయంతో అయిన కప్పి ఉంచడం.వరిపొట్టు, రంపపుపొట్టు, ఎండిన ఆకులు, వరిగడ్డి, చెరకు పిప్పి, కొబ్బరిపీరు, పీకేసిన కలుపు, చిన్నచిన్న గులకరాళ్లు వంటి ప్రకృతి సహిత పదార్ధాలను వాడుతున్నా కూడా ఇప్పుడు అంతా కృత్రిమ మయం అయ్యింది.ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లను సంచులను కూడా వాడుతున్నారు.ఈ మల్చింగ్ రెండు రకాలు..ఒకటి సెంద్రీయ, కృత్రిమ..

ప్రకృతిలో లభించే వివిధ సేంద్రియ పదార్థాలను చెట్టు బెరడు ముక్కలు, గడ్డి కత్తిరింపులు, వరి, గోధుమగడ్డి, ఆకులు, కంపోస్టు, పశువుల ఎరువు, వరిపొట్టు, రంపపు పొట్టు వాడినప్పుడు అవి నేలలో ఉండే సూక్ష్మజీవుల సహాయంతో కాలక్రమేణ కుళ్లి నేలలో సేంద్రియ పదార్థాన్ని, పోషకాలను అందించడం, నీటి నిల్వ సామర్థ్యం పెంచడం కలుపును అదుపు చేయడం వంటి లాభాలను అందిస్తాయి.

బెరడు ముక్కలు అధిక తేమని కలిగి ఉండటంతో పాటు తేమను అధిక సమయం వరకు నిలుపుకోగలుగుతాయి. వీటిని అధిక పొడి పరిస్థితుల్లో అధిక తేమ కలిగిన పరిస్థితుల్లో వాడవచ్చు..

అలాగే..ఎండిన గడ్డిని పల్చటి 2-3 ఇంచుల మందం గల పొరల్లో కూరగాయ పంటల్లో వాడవచ్చు..పంట నష్టం జరగదు..

ఎండు ఆకులను వేసి వాటి పైన చిన్న పుల్లలను వెయ్యాలి..వాడితే కుళ్లి మంచి ఎరువుగా మారి పోషకాలు అందించడంతో పాటు తేమను నిలుపుతాయి..

వరి లేదా గోధుమ గడ్డి లేదా చిరుధాన్యాల పంట వ్యర్థాలు వంటి పొలంలోనే లభ్యమయ్యే పదార్థాలను మల్చింగ్ గా వాడొచ్చు. వాటిని 6-8 అంగుళాల మందంలో పరచాలి. దీని ద్వారా నేలలో తేమ నిల్వ పెరగడమేగాక, కలుపును సమర్థంగా అరికట్టడం, వేడిని నిలువరించడంతో పాటు పోషకాలను నేలకు అందిస్తాయి..కృత్రిమ మల్చింగ్ ను కాగితాలను, లేదా కవర్లను వేస్తున్నారు…

 

Read more RELATED
Recommended to you

Latest news