కాశ్మీర్ ఫైల్స్ కి.. ‘జై శ్రీరామ్’ అనే వాళ్లకి తేడా ఏముంది..సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు

-

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమా ప్రమోషన్ల లో భాగంగా ఆమె వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఇందులో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో కొంతమంది ఆమె మీద విమర్శల వర్షం కురిపిస్తుంటే కొంత మంది ఆమెను సపోర్ట్ చేస్తున్నారు.

 

ఆ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి మాట్లాడుతూ..” కొద్ది రోజుల క్రితం కాశ్మీరీ ఫైల్స్ అనే సినిమా వచ్చింది కదా. ఆ సినిమాలో వాళ్ళు ఎలా చంపారు అనే విషయాలను చూపించారు. మనం వాటిని ఒక మత సంఘర్షణల లాగే చూస్తే.. ఇప్పుడు రీసెంట్ గా బండిలో ఆవులు తీసుకు వెళుతున్నారు.. బండి లో డ్రైవర్ ముస్లిం గా ఉన్నాడు అని కొంతమంది కట్టేసి జైశ్రీరామ్ అని అనమంటున్నారు. అలా అయితే ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది? మతాలు కాదు మనం మంచి వ్యక్తిగా ఉంటే ఇతరులను ఇబ్బంది పెట్టము. లెఫ్టిస్ట్, రైటిస్ట్ కాదు మనం మంచిగా ఉండకపోతే న్యాయం ఎక్కడా ఉండదు” అని ఆమె చెప్పుకొచ్చింది.

అయితే ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. కొంత మంది సాయి పల్లవికి చరిత్ర తెలియదు చరిత్ర తెలుసుకుని మాట్లాడమని కామెంట్ చేస్తున్నారు. కొందరైతే సాయి పల్లవి దుర్మార్గమైన వ్యాఖ్యల నేపథ్యంలో మేము విరాటపర్వం సినిమా చూడడం లేదు అని మా తరపునుంచి మేము సినిమాని బ్యాన్ చేసుకుంటున్నామని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news