కారు సారు..ఏమన్నా స్కెచ్ వేశారుగా!

-

బీజేపీ పాలనతో దేశం తీవ్రంగా నష్టపోయింది…తక్షణమే మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించి..దేశాన్ని గాడిలో పెట్టాలి…అనేది ప్రస్తుతం కేసీఆర్ నినాదం..అంటే కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తి ఉండాలనేది కేసీఆర్ ఆకాంక్ష.ఆ ప్రత్యామ్నాయ శక్తి తానే అవ్వాలని అనుకుంటున్నారు…తానే దేశానికి దిశా నిర్దేశం చేయాలని భావిస్తున్నారు. దేశంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ బలహీన పడిందని, బీజేపీని ఓడించే శక్తి కాంగ్రెస్ కు లేదని, కాబట్టి తాను జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి..బీజేపీ వ్యతిరేక శక్తులని కూడగట్టి…మోదీని గద్దె దించాలనేది కేసీఆర్ ప్లాన్.

ఇక బీజేపీని గద్దె దించడానికి కేసీఆర్ వరుసగా కొత్త స్కెచ్ లతో వస్తూనే ఉన్నారు…ఇప్పటికే జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీల అధినేతలతో సమావేశమయ్యారు..వారిని ఏకం చేయాలని చూస్తున్నారు..అలాగే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మద్ధతు తీసుకున్నారు…ఇంకా విచిత్రం ఏంటంటే…బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఏపీ నేతల సాయం కూడా కేసీఆర్ తీసుకుంటున్నారు. తాజాగా కేసీఆర్….ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ అయిన విషయం తెలిసిందే…ఆయనతో భేటీ అయ్యి…బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాల గురించి చర్చించారు. అలాగే బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎలా ఎదగాలనే అంశం గురించి కూడా మాట్లాడారు.

ఇక కేసీఆర్ తో భేటీ అయిన విషయాన్ని ఉండవల్లి…మీడియా ముందుకొచ్చి చెప్పారు..అలాగే దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలబడగల శక్తి కేసీఆర్‌కు ఉందని, బీజేపీ వ్యతిరేకులకు నాయకత్వం వహించగల సత్తా కూడా ఆయనకు ఉందని …ఉండవల్లి, కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు.

మరి ఇన్ని రోజులు ఉండవల్లి…కేసీఆర్ గురించి పెద్దగా పొగడలేదు..మరి ఇప్పుడే మొదలుపెట్టారు. అయినా కేసీఆర్ సైతం…ఓ ఏడాది నుంచే బీజేపీపై యుద్ధం చేస్తూ వస్తున్నారు….మరి అంతకముందు ఏమైందో జనాలకే తెలియాలి…అంటే ఎప్పుడైతే తెలంగాణలో బీజేపీ బలపడటం మొదలైందో అప్పటినుంచే…కేసీఆర్…యాంటీ బీజేపీ మంత్రం ఎత్తుకున్నారు..అంటే ఇక్కడ బీజేపీపై బాగా వ్యతిరేకత పెంచి…తెలంగాణలో బీజేపీని ఓ బూచిగా చూపించి…మరొకసారి అధికారం దక్కించుకోవాలనే ప్లాన్ లోనే కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పుతారో లేదో తెలియదు గాని..ఆ పేరుతో తెలంగాణలో మళ్ళీ గెలవాలని చూస్తున్నారని మాత్రం అర్ధమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news