ఆలీ సినిమాలలో నటించకపోవడానికి కారణం అదేనా..?

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని వందల చిత్రాల్లో కామెడీన్ గా నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు కమెడియన్ ఆలీ. కొన్ని చిత్రాలలో హీరోగా కూడా నటించి అలరించాడు. అయితే ఈ మధ్యకాలంలో ఆలీ వెండి తెరకు దూరమై బుల్లి తెరపై మాత్రమే అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నాడు. ఇక తాజాగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన f-3 చిత్రంతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో కూడా ఆలీ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.Comedian Ali: Not to join YCP, no clarity on future planఇక ఈ చిత్రం ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమాలోని నటించిన ప్రతి ఒక్కరు కూడా ప్రమోషన్స్ లో చాలా వేగంగా పాల్గొంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆలీ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనడం జరిగింది. తన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశాడు. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో సినిమాలు చేయకపోవడానికి గల ముఖ్య కారణం ఏమిటి అనే ప్రశ్న ఎదురవగానే ఈ ప్రశ్నకు సమాధానం ఈ విధంగా తెలియజేశారు.comedian ali about yamaleela movie, ali, comedian ali, director sv krishna reddy, family movie, yamaleela movie, no awards for yamaleela, indraja, best music award, comedian ali movie, ali as hero career, tollywood -ఆలీ మాట్లాడుతూ బుల్లితెరపై ఆలీతో సరదాగా కార్యక్రమాన్ని చేస్తున్నానని అలాగే యమలీల సీరియల్ చేస్తున్నారని తెలియజేశారు. కేవలం కృష్ణారెడ్డి కోరికమేరకు అతను యమలీల సీరియల్స్ లో నటిస్తున్నానని తెలిపారు. ఎందుచేత అంటే సినిమా కోసం ఇండస్ట్రీలో తను ఎంతోమందిని ఒప్పించి యమలీల చిత్రాన్ని తెరకెక్కించారు అందుకే ఆయన ఏం చెప్పినా నేను వెనకడుగు వేయకుండా ఆలోచించకుండా చేస్తానని తెలియజేశారు. ప్రస్తుత కాలంలో చిన్న చిన్న సినిమాలలో కూడా పలు క్యారెక్టర్లు ఇస్తున్నారు కాని కథ ఏమిటో చెప్పకుండా సినిమాలలో అవకాశం ఇస్తున్నారు సినిమా చేసిన తర్వాత ఇలాంటి చిత్రాల్లో ఆలీ నటించారని ప్రేక్షకులను అనుకోకూడదని సినిమాలు చేయడం మానేశానని తెలియజేశారు.. ముందు కథ వినిపించి పాత్ర ప్రాధాన్యత ఉంటే నటిస్తానని తెలియజేశారు ఆలీ.

Read more RELATED
Recommended to you

Latest news