BREAKING : నవజ్యోత్ సింగ్ సిద్ధూ కు జైలు శిక్ష

-

కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ కి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మూడు దశాబ్దాల నాటి రాష్ డ్రైవింగ్ కేసులో కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ కి ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. 20 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. అయితే ఈ కేసులో నవజ్యోత్ సింగ్ సిద్ధూ నేరస్తుడు అనడానికి తగిన ఆధారాలు ఏవీ లేవనే కారణంతో మే నెలలో సుప్రీంకోర్టు సిద్దు కి వెయ్యి రూపాయల జరిమానా విధించి అతడిని నిర్దోషిగా వదిలేసింది.

అయితే సుప్రీంకోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన బాధితుడి కుటుంబం.. మరోసారి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రివ్యూ పిటిషన్ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు మరోసారి నవజ్యోత్ సింగ్ సిద్ధూ కేసు పై దృష్టిసారించింది. 1998 నాటి కేసులో సిద్దు నేరస్తుడేనా, కాదా అనే కోణంలో మరోసారి ఈ కేసును రీ ఓపెన్ చేసింది. అయితే ఈ కేసులో నవజ్యోత్ సింగ్ సిద్ధూ నేరస్తుడిగా పరిగణించిన సుప్రీంకోర్టు అతడికి సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news