తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు సంవత్సరాల కొద్దీ అలాగే పాకిపోయి హీరోయిన్లుగా కొనసాగుతారు. మరికొంతమంది ఒకటి రెండు సినిమాలలో కనిపించి మరలా మాయమై పోతున్నారు. ఇలా ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా వచ్చిన అవకాశాలను వారు సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుని కెరీర్లో ముందుకు వెళ్ళలేక పోతున్నారు. కొంత మంది హీరోయిన్లకు అందం , అభినయం అన్ని ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం ఉండదు. అలాంటి హీరోయిన్లలో దీక్షా సేథ్ ఒకరు. ఆమె 2009లో మిస్ ఫెమీనా అందాల పోటీలలో ఫైనల్ లిస్టులో ఈ ముద్దుగుమ్మ ఉంది. ఆ తరువాత సినిమా ఇండస్ట్రీ లోకి రంగప్రవేశం చేసింది.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన వేదం సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా నటించింది. దీక్షా సేథ్ ఆ తర్వాత రవితేజ నటించిన మిరపకాయ్ సినిమాలో కూడా నటించింది. అంతేకాకుండా రెబల్ స్టార్ ప్రభాస్ రెబల్ సినిమాలో కూడా నటించింది. ఇక మంచు మనోజ్ సరసన ఊ కొడతారా ఉలిక్కిపడతారా వంటి సినిమాలలో నటించినప్పటికీ దీనికి అంత క్రేజ్ రాలేదు. ఆమె అంత పెద్ద హీరోల సరసన నటించిన కూడా పెద్దగా క్రేజ్ ను సంపాదించుకోలేకపోయింది. అల్లు అర్జున్ తో నటించిన వేదం సినిమా ఒక్కటే గుర్తింపు పొందిన పాత్ర చేయడం విశేషం.ఆమెకి అందం , అభినయం అన్ని ఉన్నప్పటికీ టాప్ హీరోలతో మంచి హిట్లు కొట్టలేకపోయింది. అందుకే తెలుగు లో స్టార్ హీరోయిన్ గా ఎదగలేక పోయింది. తెలుగు ని వదిలేసి బాలీవుడ్ వైపు మొగ్గు చూపింది. 2014లో లేబర్ హమ్ దివానా దిల్ అనే ఈ చిత్రంలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వచ్చిన జగ్గు దాదా సినిమాలో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అంతే కాకుండా హిందీలో మరో సినిమాలో కూడా నటించింది. కానీ ఆ సినిమాలు ఈమె కెరీర్ కి అంతగా ఉపయోగపడలేదు. తరువాత దీక్షా సేథ్ ఏ సినిమాలో కూడా నటించలేదు. ప్రస్తుతానికి ఈమె ఏం చేస్తోందో తెలియదు. కానీ ఈమె సోషల్ మీడియాలో ఈమె గురించి చర్చ మొదలైంది. సినిమాలు వదిలేసినా కానీ అభిమానులకు అందుబాటులో ఉండి ఉంటే ఆమెకు కాస్త గుర్తింపు ఉండేది కాదేమో..