సాధారణంగా జనవరిలో వర్షాలు అనే వార్త ఎప్పుడైనా విన్నారా…? ఏమో అసలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా జనవరిలో వర్షాలు అనే మాట లేదు. కేవలం చలి రావడమే గాని వర్షాలు వచ్చినట్టు లేదు. కాని ఇప్పుడు అనూహ్యంగా చలి ఎక్కడా లేదు. దానికి తోడు ఎండ వేస్తుంది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. జనవరి ఫస్ట్ రోజు వర్షం పడటం చూసి చాలా మందికి సౌండ్ లేదు.
జనవరి ఫస్ట్ వేడుకులకు చలి ఇబ్బంది పెట్టడమే గాని ఈ ఏడాది వింతగా వర్షం ఇబ్బంది పెట్టింది. ఇక రెండు రోజుల నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. అవి కూడా ఉరుములతో కూడిన వర్షాలు పడుతున్నాయి. దీనికి కారణం ఉపరితల ఆవర్తనం ఏర్పడటమే. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు రెండు రోజుల పాటు పడే అవకాశం ఉందని అంటున్నారు. బంగాళఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతుంది.
దీనితో కోస్తాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని విశాఖపట్టణంలోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బెంగాల్ నుంచి ఒడిశా మీదుగా కోస్తా వరకు బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. దీనికి తోడు ఎండలు కూడా పెరుగుతున్నాయి. సంక్రాంతి వెళ్ళిన రోజు నుంచే ఎండల తీవ్రత అనేది పెరుగుతూ వస్తుంది. ఈ ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.