కరోనా వైరస్ చైనాలోనే పుట్టిందనే విషయం ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలుసు. చిన్న పిల్లలను అడిగినా అదే సమాధానం చెబుతారు. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు ప్రవర్తిస్తోంది. ఓ వైపు ప్రపం దేశాలన్నీ.. కరోనా వైరస్‌కు కారణం చైనాయే అని మొత్తుకుంటున్నాయి.. అయినా WHO మాత్రం అసలు విషయంపై దృష్టి సారించకుండా.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇద్దరు సైంటిస్టులు చైనా చేరుకున్నారట. వారు అక్కడ వైరస్ జన్మించిందా.. లేదా.. అని పరిశీధిస్తారట.. సిల్లీగా లేదూ.. సరే.. నిజంగానే WHOకు చిత్తశుద్ధి ఉంది.. అనుకుందాం.. కానీ వైరస్ వ్యాప్తి చెంది ఇప్పటికి నెలలు గడుస్తోంది. ఇన్ని రోజుల తరువాత WHOకు సోయి రావడం నిజంగా విస్మయాన్ని కలిగిస్తోంది. అప్పుడెప్పుడో ఫిబ్రవరిలోనే చైనా తమ దేశంలో కరోనా పుట్టిందనడానికి తగిన ఆధారాలు, సాక్ష్యాలను నాశనం చేసిందని వార్తలు వచ్చాయి. వాటిని బయటి ప్రపంచానికి తెలియజేయాలనుకున్న అక్కడి డాక్టర్లు, జర్నలిస్టులను చైనా మాయం చేసింది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థలు ఈ విషయాన్ని సాక్ష్యాలతో సహా రుజువు చేశాయి. అయినా WHO మాత్రం చైనాపై ఎందుకు ప్రేమను కురిపిస్తుందనే విషయం అసలు అర్థమే కావడం లేదు.
WHO చైనాతో లాలూచీ పడిందని మొదట్నుంచీ అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకంగా WHO నుంచి తమ దేశం వైదొలగుతున్నట్లు ప్రకటించారు. ఆ సంస్థకు తమ దేశం నుంచి అందాల్సిన నిధులను కూడా పూర్తిగా ఆపేశారు. ఇక ఇప్పుడు WHO బద్దకంగా మేల్కొని.. వైరస్ ఎక్కడ పుట్టింది, చైనాలోనేనా.. ఇతర దేశాల్లోనా.. అని నీరసంగా పని మొదలు పెట్టింది. వైరస్ జన్మస్థానం చైనా అని తెలిసినా WHO ఈ ధోరణి ప్రదర్శిస్తుండడం వెనుక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇతర దేశాల్లోనూ వైరస్ పుట్టి ఉంటుందని వారు పరిశోధనలు చేస్తారట.. ఇది ఎంత హాస్యాస్పదమైన విషయమో కదా.
అసలు సాక్ష్యాలను మాయం చేశాక చైనాలో అయినా WHO బృందం పర్యటించి ఏం చేస్తుంది ? చైనాలోనే మొదటగా కరోనా కేసులు వచ్చాయని తెలిసి కూడా ఇతర దేశాల్లో ఈ వైరస్ మూలాల కోసం వెదుకుతారట. ఇది చాలా నిస్సిగ్గయిన విషయం. WHO ఇప్పటికైనా మేల్కొని అసలు కరోనా వైరస్ పట్ల తమకు మొదట్నుంచీ తెలిసిన సమాచారాన్ని ప్రపంచంతో పంచుకోవాలి. లేకపోతే రాబోయే రోజుల్లో WHO సంస్థ కేవలం చైనాకే పరిమితమయ్యే అవకాశం ఉంది.