కరోనా కలకలం : ఆ హీరోయిన్ డ్రైవర్ కి.. ఈ ఎంపీ పీఏకి..!

-

 

బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ డ్రైవర్‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా సారానే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. విషయం తెలుసుకున్న ముంబై కార్పొరేష‌న్ అధికారులు డ్రైవ‌ర్‌ను క్వారంటైన్‌కు త‌ర‌లించారు. అంతేకాదు సారా కుటుంబ స‌భ్యుల‌తో పాటు ఆఫీసు సిబ్బందికి క‌రోనా టెస్టులు చేయించారు. అయితే కరోనా టెస్టులలో అంద‌రికీ నెగిటివ్ అని రిపోర్టు వ‌చ్చింది.

అలాగే రేసు గుర్రం మూవీ విలన్, బీజేపీ ఎంపీ రవికిషన్ పర్సనల్ అసిస్టెంట్‌ గుడ్డూ పాండేకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో అత‌ని‌ని ఆసుప‌త్రికి త‌ర‌లించి వైద్యం అందిస్తున్నారు. అయితే పాండేకి కరోనా సోకింద‌నే విష‌యం తెలిసిన వెంట‌నే ర‌వికిష‌న్‌తో పాటు అత‌నితో కాంటాక్ట్ అయిన వాళ్లు క్వారంటైన్‌కి వెళ్ళారు. పాండే త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధిస్తున్నాను అని ర‌వికిష‌న్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news