బ్యాంకులు మూతపడితే మన డబ్బు ఏమవుతుంది? తిరిగి వస్తుందా?

-

సామాన్యుడి నుండి ధనికుడి వరకు డబ్బులను దాచుకునేది బ్యాంకులోనే. ఐతే కొంతమంది ధనికులు వివిధ రకాల పద్దతుల్లో డబ్బులు దాస్తుంటారు. వారి గురించి వదిలేస్తే, సామాన్యులు అందరూ బ్యాంకులోనే డబ్బులు దాస్తారు. ఇంట్లో ఒక్క పైసా ఉంచకుండా బ్యాంకు మీద నమ్మకంతో అక్కడ ఉంచుతారు. ఐతే మీకెప్పుడైనా అనిపించిందా? ఒకవేళ బ్యాంకులు ( Banks ) మూసివేస్తే పరిస్థితి ఏమిటి అని? సడెన్ గా బ్యాంకు తలుపు మూసేసి దివాళా తీస్తే మన డబ్బులు తిరిగి వస్తాయా అన్న అనుమానం మీకు కలిగిందా?

బ్యాంకులు | Banks
బ్యాంకులు | Banks

ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఇలాంటి అనుమానాలకు తావిస్తాయనడంలో సందేహం లేదు. గతంలో యెస్ బ్యాంకులో ఖాతాలు ఉన్నవారు 5లక్షల కంటే ఎక్కువ తీసుకోవద్దు అని నియమం రావడం, లక్ష్మీ విలాస్ బ్యాంకు దివాళా తీయడం మొదలైనవన్నీ బ్యాంకుల మీద నమ్మకాన్ని తగ్గించాయి.

అదలా ఉంచితే, బ్యాంకులు మూతపడితే మీ సొమ్ము తిరిగి వస్తుందా అన్న ప్రశ్నకు సమాధానం ఇక్కడ చూద్దాం.

నిజానికి బ్యాంకులో పెట్టిన డబ్బులకు ఇన్స్యూరెన్స్ ఉంటుంది. దాని ఆధారంగా మీ డబ్బుకు రక్షణ ఉంటుంది. అది కేవలం 5లక్షల రూపాయల డిపాజిట్ లేదా అంతకంటే తక్కువ ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది. అంటే దీనర్థం ఒకవేళ బ్యాంకు మూతపడితే మీ 5లక్షలు లేదా అంతకు లోపు డబ్బు మొత్తం మీకు వచ్చేస్తుంది. అంతకంటే ఎంత ఎక్కువ ఉన్న 5లక్షల వరకే వస్తుంది.

కోటి రూపాయలు ఉన్నా సరే మీకు వచ్చేది 5లక్షలే అన్నమాట. ఈ డబ్బు రావడానికి ఇంతకు ముందు అనేక షరతులు ఉండేవి. ప్రస్తుతం కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు దీనిపై సవరణ జరగాలని పార్లమెంటులో ప్రతిపాదనకు వచ్చింది. ఒకవేళ అది ఓకే ఐతే గనక బ్యాంకు మూతపడిన 90రోజుల్లో 5లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉన్న డిపాజిట్ డబ్బులు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news