ఒక వాట్సాప్ అకౌంట్‌.. 4 డివైస్‌ల‌లో.. ఫీచ‌ర్ వ‌చ్చేస్తోంది..!

-

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న యూజ‌ర్ల‌కు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను అందిస్తోంది. అందులో భాగంగానే భార‌త్‌లోని యూజ‌ర్ల‌కు ఇటీవ‌ల వాట్సాప్ పే సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే వాట్సాప్ మ‌ల్టీ డివైస్ స‌పోర్ట్ ఫీచ‌ర్‌ను ఎప్ప‌టి నుంచో టెస్ట్ చేస్తున్నారు. అదిగో వ‌స్తుంది, ఇదిగో వ‌స్తుంది.. అంటూ ఈ ఫీచ‌ర్ గురించి ఊద‌ర‌గొట్టేశారు. అయితే ఎట్ట‌కేల‌కు వాట్సాప్ ఈ ఫీచ‌ర్‌ను అతి త్వ‌ర‌లోనే ప్ర‌వేశ‌పెట్ట‌నుందని తెలిసింది.

whatsapp multi device feature in 4 devices coming soon

డ‌బ్ల్యూఏ బీటా ఇన్ఫో అనే వెబ్‌సైట్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం వాట్సాప్ మాతృసంస్థ ఫేస్‌బుక్ ప్ర‌స్తుతం వాట్సాప్‌లో మ‌ల్టీ డివైస్ ఫీచ‌ర్‌ను చివ‌రి ద‌శ‌లో టెస్ట్ చేస్తున్న‌ట్లు తెలిసింది. అయితే మ‌ల్టీ డివైస్ ఫీచ‌ర్‌ను గ‌న‌క ఎనేబుల్ చేస్తే ఒకే వాట్సాప్ అకౌంట్ ను భిన్న డివైస్‌ల‌లో వాడుకోవ‌చ్చు. అలాంట‌ప్పుడు మెసేజ్‌ల వ‌ర‌కు ఓకే. కానీ కాల్స్ వ‌స్తే ఏ డివైస్ నుంచి కాల్స్ స్వీక‌రిస్తారు ? అనే అంశంపైనే ఇప్పుడు ఫేస్‌బుక్ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్న‌ట్లు తెలిసింది. అయితే దీనికి ఒక విధానాన్ని పాటించేలా ఫీచ‌ర్‌ను అందిస్తార‌ని తెలిసింది.

మ‌ల్టీ డివైస్ ఫీచ‌ర్‌ను వాట్సాప్‌లో ఒకేసారి 4 డివైస్‌ల‌లో వాడుకునే విధంగా అందుబాటులోకి తెస్తార‌ని స‌మాచారం. అయితే 4 డివైస్‌ల‌లో ఒకే డివైస్‌ను మెయిన్ డివైస్ గా సెట్ చేసుకునే వీలు క‌ల్పిస్తారు. దీంతో ఆ డివైస్ నుంచే కాల్స్ ను స్వీక‌రించాల్సి ఉంటుంది. ఇక మిగిలిన 3 డివైస్‌ల‌లో మెసేజ్‌ల‌ను కూడా యాక్సెస్ చేయ‌వ‌చ్చు. ఇలా మ‌ల్టీ డివైస్ ఫీచ‌ర్ ద్వారా ఒక వాట్సాప్ ఖాతాను ఏకంగా 4 డివైస్‌ల‌లో ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే లింక్ ఎ న్యూ డివైస్ అనే ఆప్ష‌న్ త్వ‌ర‌లోనే వాట్సాప్‌లో క‌నిపిస్తుంద‌ని తెలుస్తోంది. అయితే ఈ ఫీచ‌ర్ విడుద‌ల గురించి క‌చ్చిత‌మైన తేదీ తెలియ‌దు. కానీ అతి త్వ‌ర‌లోనే ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

4 టాప్ బ్యాంకుల‌తో అందుబాటులోకి వ‌చ్చిన వాట్సాప్ పే సేవ‌లు

Read more RELATED
Recommended to you

Latest news