ఫ్యాక్ట్ చెక్: రెండు నెలల వరకు లాక్ డౌన్ అని వచ్చిన వాట్సాప్ వాయిస్ మెసేజ్ లో నిజమెంత…?

-

సోషల్ మీడియా లో రోజు రోజుకీ ఫేక్ మెసేజ్లు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ వచ్చినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో పలు ఫేక్ వార్తలని మనం వింటున్నాం. మొన్నటికి మొన్న ముస్లింలు మసీదు నుండి వచ్చే ఫోటో… ఆ తరువాత పీరియడ్స్ సమయంలో వ్యాక్సిన్ ని మహిళలు వేయించుకోకూడదు అనడం ఇలా ఎన్నోరకాల ఫేక్ వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా మరో ఫేక్ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. వాట్సాప్ లో ఇది తెగ షికార్లు కొడుతోంది.

 

తాజాగా వాట్సాప్ లో మాకు తెలిసిన బంధువులు డబ్ల్యూహెచ్ఓ పని చేస్తున్నారని…. కొన్ని రోజులు లో లాక్ డౌన్ ఉంటుందని… రెండు నెలలకు సరిపడే సామాన్లని తెచ్చుకోమని ఆయన వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పెట్టారు. అదే విధంగా బ్యాంకులు కూడా పని చేయవని ఇంటికి అవసరమయ్యే క్యాష్ తెచ్చుకుని పెట్టుకోమని దీనికి సిద్ధంగా ఉండమని చెప్పారు.

ఫ్యాక్ట్ చెక్: ఈ విషయానికి సంబంధించి తాజాగా ప్రెస్ నోట్ వచ్చింది. సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తూ ఇటీవల వచ్చిన నకిలీ ఆడియో వార్త సారాంశం ప్రపంచ ఆరోగ్య సంస్థ లో పని చేస్తున్న నా స్నేహితుడు సమాచారం ఇచ్చినట్లు ఆ సమాచారాన్ని గ్రూపులో మిత్రులకు చెప్పినట్లు ఉన్నది.

ఈ నకిలీ ఆడియో వార్త గురించి ఏపీ సీఐడీ విభాగం లో గత సంవత్సరం లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆడియో గురించి సీఐడీ విభాగం వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కావున సోషల్ మీడియాలో ఇటువంటి ఫేక్ సమాచారాన్ని ఎవరు నమ్మద్దు అని ఇటీవల ప్రెస్ నోట్ విడుదల అయ్యింది. ఇటువంటి ఫేక్ మెసేజెస్ ని ఇతరులకి ఫార్వర్డ్ చేయకండి.

Read more RELATED
Recommended to you

Latest news