ఏపీ లో రేషన్ కార్డు ఉన్నవారికి నగదు సహాయం ఎప్పుడు పంపిణి చేస్తారు అంటే ..!

-

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో సామాన్యులు ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదలు నిత్యావసరాల వస్తువులు కొనుక్కోవడానికి వీలుగా ఏపీ ప్రభుత్వం రూ.1000 అందజేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రేషన్ బియ్యం పంపిణీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

త్వరలోనే నగదును కూడా అందజేసేందుకు రంగం సిద్ధం చేసింది జగన్ సర్కార్. తెల్ల రేషన్ కార్డు కలిగివున్న ప్రతి కుటుంబానికి శనివారం నుంచి రూ.1000 రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ మేరకు డీఆర్‌డీఏ సొమ్మును గ్రామ/వార్డు సచివాలయ ఖాతాలకు తాజాగా జమ చేసింది. గ్రామ/వార్డు వలంటీర్లు లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి ఈ సొమ్మును శనివారం అందిస్తారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పించన్ లను ఇంటి ఇంటికి వెళ్లి అందిస్తుంది.

అదే విధంగా ఇప్పుడు ఈ నగదు కూడా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కార్డుదారుడి ఇంటికి వెళ్లి కుటుంబ యజమాని ఫొటో తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని వలంటీర్లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న వాళ్లకు 1500 అందిస్తుంది. అక్కడ ఒక్కొక్కరికి 12 కిలోల రేషన్ బియ్యం కూడా అందిస్తుంది కెసిఆర్ సర్కార్.

Read more RELATED
Recommended to you

Latest news