వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి చేస్తున్న విమర్శలు తెలుగుదేశం పార్టీని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఏదోక రూపంలో ఆయన ట్విట్టర్ వేదికగా విమర్శల బాణాలు సంధిస్తున్నారు. తాజాగా మరో మారు విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ఆయన విమర్శలు చేసారు.
ఏడాదిలోనే ఎవరూ వూహించని రీతిలో సీఎం జగన్ గారి సుపరిపాలన ఉందని చెప్పారు. అర్హత కలిగిన అన్ని వర్గాల వారికి రూ.41,718కోట్లు లభ్ది.90% హామీలు అమలు చేసారని అన్నారు. ఏడాది పాలనపై ప్రజల వద్దకు మేనిఫెస్టో, ప్రోగ్రెస్ రిపోర్ట్ అని చెప్పారు. మేనిఫెస్టోను మాయం చేసిన బాబెక్కడ? అని ప్రశ్నించారు. ప్రజలకే తన ప్రోగ్రెస్ రిపోర్ట్ అడుగుతున్న జగన్ గారెక్కడ? అంటూ పోల్చారు.
ఏడాదిలోనే ఎవరూ వూహించని రీతిలో సీఎం జగన్ గారి సుపరిపాలన. అర్హత కలిగిన అన్ని వర్గాల వారికి రూ.41,718కోట్లు లభ్ది.90% హామీలు అమలు. ఏడాది పాలనపై ప్రజల వద్దకు మేనిఫెస్టో,ప్రోగ్రెస్ రిపోర్ట్. మేనిఫెస్టోను మాయంచేసిన బాబెక్కడ? ప్రజలకే తన ప్రోగ్రెస్ రిపోర్ట్ అడుగుతున్న జగన్ గారెక్కడ?
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 30, 2020