జాన్సన్ అండ్ జాన్సర్ నుండి కరోనా వ్యాక్సిన్.. డబ్ల్యూహెచ్ వో అనుమతి.

-

కరోనా మహమ్మారి నుండి తప్పించుకోవాలని, వ్యాక్సిన్ ని కనుక్కునే ప్రయత్నంలో కొన్ని కంపెనీలు సఫలీకృతం అయ్యాయి. ఇండియా నుండి కోవ్యాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు వచ్చాయి. కోవ్యాక్సిన్ ని భారత్ బయోటెక్ తయారు చేయగా, కోవిషీల్డ్ ని సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం మన దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకుంది. తాజాగా జాన్సన్ అండ్ జాన్సన్ కూడా వ్యాక్సిన్ ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఐతే ఇది సింగిల్ డోస్ వ్యాక్సిన్ కావడం విశేషం.

మన దగ్గర డబుల్ డోసు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఒక డోసు వేయించుకున్న తర్వాత 14రోజులకి మరో డోసు వేయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రెండవ డోసు అవసరం లేకుండా కేవలం ఒక డోసునే తీసుకువచ్చింది జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ. ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్ కి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులు కూడా ఇచ్చేసింది. పేద దేశాలకు వీటిని సరఫరా చేసేందుకు కృషి చేయాలని, ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా వ్యాక్సిన్ ధరలు ఉండాలని నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news