సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలలో కలెక్షన్లలో ఎవరు హైయెస్ట్ అంటే ..?

-

ఈ ఏడాది సంక్రాంతి బరిలో తెలుగు సినిమాలలో చిరంజీవి , బాలకృష్ణ పోటీ పడడంతో పాటు తమిళంలో అజిత్ , విజయ్ దలపతి పోటీగా నిలిచారు. అయితే అక్కడ ఆ రెండు సినిమాలకి యావరేజ్ టాక్ రావడం జరిగింది. ఇక తెలుగులో వీరసింహారెడ్డి సినిమాకి సెకండ్ డే యావరేజ్ టాక్ వినిపిస్తోంది. ఇక వాల్తేర్ వీరయ్య సినిమా హిట్ టాక్ తో ముందుకు దూసుకుపోతోంది చిరంజీవి గత సినిమాల కంటే వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ గా ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి సంక్రాంతి బరిలో ఏ సినిమా ఎంతటి కలెక్షన్లు రాబట్టిందో చూద్దాం.

ఈ నాలుగు సినిమాల మొదటి రోజు కలెక్షన్ల పరంగా చూసుకుంటే బాలకృష్ణ ముందు వరసలో ఉండడం గమనార్హం. బాలకృష్ణ గత సినిమా అఖండ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ హైప్ తోనే వీర సింహారెడ్డి సినిమా కూడా మొదటి రోజే కలెక్షన్ల పరంగా రూ.54 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. చిరంజీవి ముందు సినిమాలు గాడ్ ఫాదర్, ఆచార్య సినిమాలు అనుకున్నంత స్థాయిలో ఫ్యాన్స్ ని మెప్పించలేకపోయాయి . దీంతో మొదటి రోజే కలెక్షన్ల రూ.49.10కోట్ల రూపాయలు గ్రాస్ వచ్చినట్లు సమాచారం.

ఇక విజయ్ వారసుడు సినిమా మొదటి రోజు రూ.47.52 కోట్ల గ్రాసుని రాబట్టినట్లు తెలుస్తోంది. అది తమిళంలో మాత్రమే ..రెండు భాషలలో ఒకేసారి విడుదలయ్యి ఉంటే కచ్చితంగా ఎక్కువగానే వచ్చేదని చెప్పవచ్చు. ఇక అజిత్ నటించిన తెగింపు సినిమా అన్నిటికంటే తక్కువగా రూ.41 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఈ సినిమా ఇప్పటికే డివైడ్ టాక్ రావడంతో కలెక్షన్లు తగ్గిపోయాయి. ఈ నాలుగు సినిమాలలో బాలకృష్ణదే మొదటిరోజు కలెక్షన్ల పరంగా పై చేయని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news