ఆమూవీలో తాగిన‌టించిన సూప‌ర్ స్టార్‌ .. ఎవ‌రంటే?

-

పాత్ర కోసం ఏదైనా చేయ‌డానికి వెన‌కాడ‌ని ఒకే ఒక్క సూప‌ర్ స్టార్ అమీర్ ఖాన్‌. ఆయ‌న చేసే ప్ర‌తి సినిమాలోని త‌న రోల్ కోసం అత్య‌ధికంగా క‌ష్ట‌ప‌డుతుంటాడు. లుక్ ద‌గ్గ‌రి నుంచి బ‌రువు వ‌ర‌కు అన్నివిధాలుగా ఆయ‌న్ను మార్చుకుంటారు. ఇందుకోసం జిమ్‌లో ఏకంగా గంట‌ల పాటు శ్ర‌మిస్తుంటారు. ఇక ఆయ‌న చేసిన ఓ సినిమా కోసం ఏకంగా తాగాడంట‌.

న‌మ్మ‌డానికి వీలుగా లేక‌పోయినా ఇదే నిజం. ఆయ‌న న‌ట విశ్వ‌రూపం గురించి చెప్పాలంటే దంగ‌ల్ మూవీ చూస్తే స‌రిపోతుంది. ఆ సినిమాల పాత్ర కోసం ఆయ‌న ఎంత‌లా మారిపోయారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న ఆయ‌న చేసిన త్రీ ఇడియ‌ట్స్ కోసం చేసిన పాత్ర నిజంగా ఓ అద్భుత‌మ‌నే చెప్పాలి.

త్రీ ఇడియ‌ట్స్ మూవీలో హీరో త‌న ఫ్రెండ్స్‌తో కలిసి తాగే సీన్ కోసం నిజంగానే తాగాల‌ని అమీర్ ఖాన్ అనుకున్నారు. అప్పుడు డైరెక్ట‌ర్ రాజ్ కుమార్ హిరాని ఈ విస‌యానికి ఒప్పుకోలేదు. సీన్ కోసం నార్మల్ గా నటిస్తే స‌రిపోతుంద‌ని చెప్పినా.. అమీర్ ఖాన్ మాత్రం విన‌కుండా నిజంగానే రెండు పెగ్గులు తాగి నటించాడు. ఇక ఆ మూవీ పెద్ద సక్సెస్ అయ్యింది. రూ.500 కోట్లకు వ‌ర‌కు వ‌సూలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news