కరోనా తొలి రోగి ఎవరో తెలుసా…?

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఇప్పుడు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పేరు వింటేనే ప్రభుత్వాలకు చెమటలు పడుతున్నాయి. కరోనా వైరస్ ని తక్కువ అంచనా వేసిన వాళ్ళు అందరికి కూడా అది చుక్కలు చూపిస్తుంది అనేది వాస్తవ౦. ఇదిలా ఉంటే కరోనా వైరస్ సోకిన తొలి రోగిని గుర్తించారు. చైనాలోని వూహాన్ నగరంలో ఉన్న సీమార్కెట్ లో రొయ్యలు అమ్ముకుని బతికే 57 ఏళ్ల మహిళను ‘పేషెంట్ జీరో’గా ఇప్పుడు గుర్తించారు.

కరోనావైరస్ మహమ్మారి మూల బిందువు వీ గుక్సియన్ అనే మహిళ అని అంతర్జాతీయ వార్తా సంస్థ ది వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన పరిశోధనలో బయటపడింది. గత ఏడాది డిసెంబర్ 10 న హువానన్ సీఫుడ్ మార్కెట్లో రొయ్యలను విక్రయిస్తున్నప్పుడు ఆమెకు జలుబు చేసింది. ఆమె సాధారణ జలుబు అనుకుని దాన్ని లైట్ తీసుకుంది. చికిత్స కోసం స్థానిక క్లినిక్‌కు వెళ్లగా, అక్కడ ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చినా అది తగ్గలేదు.

వీ వూహాన్ ప్రాంతంలోని అతిపెద్ద యూనియన్ హాస్పిటల్ లో డిసెంబర్ 16 చికిత్స కోసం జాయిన్ అయిందని గుర్తించారు. అప్పటికే అదే లక్షణాలతో ఆస్పత్రిలో చాలా మంది వచ్చారు. వారు అందరికి ఆమె నుంచి సోకింది అని గుర్తించారు. నెలరోజుల చికిత్స తర్వాత జనవరిలో పూర్తిస్థాయిలో కోలుకున్న ఆమె ఇంటికి వెళ్ళగా ఆమెకు తానే తొలి రోగి అనే విషయం ఇప్పుడే తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news