పవన్ బ్లాక్ బస్టర్ సినిమాని మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..?

-

పవన్ కళ్యాణ్ సినీ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం గబ్బర్ సింగ్. సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే అందుకే ఆయన సినిమా కోసం ఎన్ని రోజులైనా సరే ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలో కొత్త రికార్డులను సైతం క్రియేట్ చేసింది. శృతిహాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.65 కోట్లకు పైగా వసూలు రాబట్టి రికార్డు సృష్టించింది.

ఈ సినిమా ఇంతటి విజయాన్ని పొందడానికి కారణం వెంకటేష్ అని.. తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి. మూవీ మొగల్ డాక్టర్ డి రామానాయుడు తనయుడిగా విక్టరీ వెంకటేష్ కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన.. దాదాపు 70 కి పైగా సినిమాలలో నటించారు. డిఫరెంట్ మూవీస్ చేసి మెప్పించిన ఈయన సూర్యవంశం, చినరాయుడు, సుందరకాండ , చంటి, బొబ్బిలి రాజా, కలిసుందాం రా, ప్రేమించుకుందాం రా, లక్ష్మి , దృశ్యం ఇలా ఎన్నో విభిన్నమైన సినిమాలతో అటు క్లాస్ ఇటు మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తున్నాడు వెంకీ.

అయితే ఎక్కువగా రీమేక్ మూవీస్ చేసి హిట్స్ కొట్టిన ఈయన హిందీలో హిట్ అయిన మూవీని తెలుగులో గబ్బర్ సింగ్ గా తీయాలని ప్లాన్ చేస్తుంటే.. తనకంటే పవన్ కళ్యాణ్ కి ఈ క్యారెక్టర్ సూట్ అవుతుందని డైరెక్టర్ కి సలహా ఇచ్చారట. దాంతో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా తీసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. అలా గబ్బర్ సింగ్ విజయం వెనుక వెంకీ ఉన్నాడని తేలింది. ఏది ఏమైనా వెంకటేష్ వల్ల పవన్ కళ్యాణ్ ఖాతా లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఒకటి వచ్చే చేరిందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news