నకిలీ మద్యంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్‌..వాడు పక్క రాష్ట్రమైన, మనోడైనా, వదిలిపెట్టబోం !

-

నకిలీ మద్యంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాడు పక్క రాష్ట్రమైన, మనోడైనా, వదిలిపెట్టబోమని నకిలీ మద్యంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్‌ ఇచ్చారు. గతంలో ఏపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జిల్లాల వారీగా తీసుకొచ్చి అమ్ముకునేవారని.. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం వలన, ఇతర రాష్ట్రాలలో వచ్చే మద్యాన్ని కట్టడి చేయడం చేస్తున్నామన్నారు.

నకిలీ మద్యం అమ్మకాలు చేసే వారి పైన తయారు చేసే వారిని ఎవరిని వదిలా పెట్టవద్దని ఆదేశించామని.. ఇక్కడి నుండి ఖాళీ బాటిల్స్, లేబుల్స్ తీసుకొని వెళ్ళి ఒడిస్సా లోని కటక్ అటవీ ప్రాంతంలో తయారు చేయడమని పేర్కొన్నారు. ఎక్సైజ్ అధికారులు వద్ద ఆయుధాలు ఉండవని… తలలు పగిలిన, ప్రాణాలు పోతున్న గుడుంబాను అరికట్టామని వెల్లడించారు. తీగ లాగితే డొంక కదిలినట్లు మొత్తం నకిలీ మద్యం తయారీ గుట్టురట్టు అయ్యిందని.. ఎక్కడా, ఎవరికి అనుమానం రాకుండా బార్ కోడ్లు ఏర్పాటు చేశారన్నారు. కంపెనీలు తయారు చేసేంత ఆల్కహాల్ పర్సంటేజీ ఉంచారని..చాలా పకడ్బందీగా తయారు చేస్తున్నారని స్ఫష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news