WHO వార్నింగ్… ఓమిక్రాన్ ను తేలిగ్గా తీసుకోవద్దు.

-

కరోనాను తక్కువ అంచనా వేయవద్దని WHO వార్నింగ్ ఇస్తోంది. ఓమిక్రాన్ చాలా వేగంగా వ్యాపిస్తుందని.. త్వరలో డెల్టా వేరియంట్ ను అధిగమిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. తక్కువ సమయంలోనే కేసులు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకుంటోందని పేర్కొంది. రోగాలు ఉన్నవారు, వయసు మీదపడ్డ వారిపై తీవ్రంగా ఉంటుందని WHO  హెచ్చరిస్తోంది. ఇప్పటికే పలు మార్లు WHO  హెచ్చరించింది. దాదాపు 6 రెట్లు వేగంగా ఓమిక్రాన్ వ్యాపిస్తుందని తెలపింది.

ఇదిలా ఉంటే ప్రపంచంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. అమెరికా, యూకేలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇక్కడ నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా ఓమిక్రాన్ కేసులే ఉంటున్నాయని అక్కడి నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 5.5 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో సగం కేసులు ఒక్క యూకేలోనే నమోదయ్యాయి. సుమారుగా యూకేలో ఇప్పటికే 3 లక్షల కేసులు నమోదయ్యాయి. రానున్న కాలంలో  ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా ఓమిక్రాన్ కేసులు పెరగే అవకాశం ఉంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news