కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై ధ్వజమెత్తారు. కరోనా పాజిటివ్ వచ్చిన అమిత్ షా ప్రభుత్వ హాస్పిటల్‌కు ఎందుకు వెళ్లలేని ప్రశ్నించారు. ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్‌ను కాదని, పక్కనే గుర్గావ్‌లో ఉన్న ప్రైవేటు హాస్పిటల్‌లో ఎందుకు చేరారని అడిగారు. ప్రజాప్రతినిధులు ఇలాంటి సమయాల్లోనే ప్రజలకు ప్రభుత్వ హాస్పిటళ్ల పట్ల నమ్మకాన్ని కలిగించాలన్నారు. అలా చేయకుండా నేతలే ఇలా చేస్తే ఎలా అని థరూర్ ప్రశ్నించారు.
కాగా హోం మంత్రి అమిత్‌షాకు ఆదివారమే కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన డాక్టర్ల సూచన మేరకు గుర్గావ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో చేరారు. తాను బాగానే ఉన్నానని, వైద్యుల సూచన మేరకు హాస్పిటల్‌లో చేరానని అమిత్‌షా తెలిపారు.
అయితే అమిత్‌షా మాత్రమే కాదు.. నిజానికి దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ప్రజా ప్రతినిధులు, నేతలందరూ కరోనా రాగానే ప్రైవేటు హాస్పిటళ్లలో చేరుతున్నారు. కానీ పేదలకు మాత్రం ప్రభుత్వ హాస్పిటళ్లలో సరైన సదుపాయాలు అందడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ప్రతిపక్ష పార్టీలు ధ్వజమెత్తుతున్నాయి.