తెలుగుదేశం పార్టీలో యువ నాయకులు చాలా వరకు కూడా లేరు. చాలామంది నాయకులు పార్టీ కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నా సరే చంద్రబాబునాయుడు కొంతమందిని పక్కన పెట్టడం వల్ల ఇబ్బంది పడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కొంతమంది కీలక నేతల విషయంలో చంద్రబాబు నాయుడు కాస్త కఠినంగా వ్యవహరించకపోతే పార్టీ ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉండవచ్చు అనే భావన ఉంది.
ప్రధానంగా కొంతమంది నేతలు పని చేయకపోయినా సరే వాళ్లను నెత్తిన పెట్టుకొని మోస్తున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు నిర్ణయాలు తీసుకునే విషయంలో కఠినంగా అడుగులు వేయకపోతే మాత్రం పార్టీలో కార్యకర్తల కూడా పనిచేసే అవకాశం ఉండకపోవచ్చు. కర్నూలు అలాగే కడప జిల్లాలో చాలా మంది నేతలు పార్టీ కోసం పని చేయడం లేదు. కొంతమంది నేతలు పార్టీ కోసం పని చేయడానికి ముందుకు వస్తున్న చంద్రబాబు వాళ్ళని ముందుకు రానీయడం లేదు.
పని చేయని వాళ్ళ విషయంలో ఆయన చూసి చూడనట్లు వ్యవహరించడం ఎప్పుడు ఇబ్బంది పెడుతుంది. ప్రభుత్వంలో ఉన్న సమయంలో కూడా కొంతమంది ఇదే విధంగా వ్యవహరించడంతో పార్టీ నష్టపోయింది. ఇప్పుడు కూడా వాళ్లు ప్రజల్లోకి రాకుండా కేవలం వ్యాపారాల కోసం కర్ణాటక వెళ్లి ఉండటం కూడా ఇబ్బందికరంగా మారింది అనే భావన చాలా మందిలో ఉంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో సీనియర్ నేతలతో పాటు యువ నేతలలో కూడా అసహనం పెరిగిపోతోంది.