రాత్రిపూట ఎందుకు గ్యాస్ట్రిక్‌ సమస్య పెరుగుతుంది..?

-

గ్యాస్‌ సమస్యతో ఈరోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇష్టమైనది తిందామంటే.. ఎక్కడ గ్యాస్‌ ఎక్కువ అవుతుందేమో అని భయం.. గ్యాస్ట్రిక్‌ సమస్య పగలు కంటే రాత్రుళ్లు ఎక్కువగా ఉంటుంది. మీరు వినే ఉంటారు.. రాత్రిపూట గ్యాస్‌ పట్టేసి తెగ ఇబ్బంది పెట్టింది అని.. రాత్రిపూట కడుపులో గ్యాస్ ఎందుకు ఏర్పడుతుంది. దీనికి గల కారణాల గురించి తెలుసుకుందాం.
కొందరికి రాత్రిపూట ఎక్కువగా తినే అలవాటు ఉంటుంది. దీంతో కడుపులో గ్యాస్ ఏర్పడటం వేగంగా జరుగుతుంది. సాధారణంగా రాత్రిపూట పార్టీలు, విందులకు బయటకు వెళ్లడానికి ఇష్టపడతారు. ఈ పరిస్థితిలో సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది.. విందులో ఆయిల్ ఫుడ్ తింటారు.. ఇది కడుపుకు మంచిది కాదు. ఆహారం జీర్ణం కావడానికి 6 గంటల సమయం పడుతుంది. అయితే సాయంత్రం స్నాక్స్‌లో ఎక్కువ నూనెతో కూడిన వాటిని తింటే రాత్రి భోజనం తర్వాత కడుపు సమస్యలు మొదలవుతాయి. ఈ కారణంగా ఉబ్బరం సమస్య వస్తుంది. రాత్రి భోజనం తర్వాత కనీసం 15 నుంచి 20 నిమిషాలు నడవాలి..ఇది ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. కానీ అలా చేయరు.
కొందరికి ఆహారం తీసుకున్న వెంటనే మంచంపై పడుకునే అలవాటు ఉంటుంది. ఈ పరిస్థితుల్లో జీర్ణక్రియలో సమస్యలు ఏర్పడి పొట్టలో గ్యాస్ మొదలవుతుంది. మీరు రోజంతా 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగకపోతే ఆహారం జీర్ణం కాదు.. ఇది గ్యాస్ట్రైటిస్ పెరగడానికి కారణమవుతుంది. అందుకే లంచ్ , డిన్నర్ టైమింగ్ కచ్చితంగా పాటించాలి. ఆకలి లేకున్నా, పని ఉన్నాసరే.. టైమ్‌ అయిందంటే తినేయాలి.. రాత్రిపూట ఎప్పుడూ హెవీ లేదా ఆయిల్ ఫుడ్ తినవద్దు. వీలైనంత వరకూ రాత్రి తేలికగా అరిగే ఆహారాలను తీసుకోవటం వల్ల ఈ సమస్య రాదు.. ముఖ్యంగా మసాల ఐటమ్స్‌, చికెన్‌, మటన్‌ లాంటివి నైట్‌ తింటే..సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. అవి త్వరగా అరగవు.. అవే తేన్పులు వస్తాయి.. నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఒకవేళ రాత్రి నాన్‌వెజ్‌ తినే ప్లాన్‌ ఉంటే.. వీలైనంత వరకూ రాత్రి 8 లోపే డిన్నర్‌ ముగించేయండి.. ఇలా చేయడం వల్ల నిద్రపోయేసరికి ఫుడ్‌ అరిగిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news