రాజమౌళి ఇన్ని జాగ్రత్తలు ఎందుకు…?

-

టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ విషయంలో ఇప్పుడు ఎంత ఆసక్తి ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా కోసం టాలీవుడ్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఈ సినిమా చూస్తామా…? రాజమౌళి ఎప్పుడు ఈ సినిమాను విడుదల చేస్తారా అనేది అందరిలో ఒక తెలియని ఆసక్తి నెలకొంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీనితో కరోనా ప్రభావం తగ్గిన తఃర్వాత చిత్ర యూనిట్ మళ్ళీ మిగిలిన షూటింగ్ ని మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా మిగిలిన షూటింగ్ మహారాష్ట్ర లోని పూణే లో జరగాల్సి ఉంది. అక్కడ కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. దీనితో ఇది మరింత కాలం వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.

ఇది పక్కన పెడితే ఇప్పుడు రాజమౌళి ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. తనకు అత్యంత నమ్మకస్తులు అయితేనే ఇప్పుడు సినిమా కు సంబంధించిన వర్క్ ని అప్పగిస్తున్నాడు. సినిమా షూటింగ్ చేసిన సీన్స్ ని ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. సంగీత దర్శకుడు, అలాగే నిర్మాత, తను, హీరోలు ఇద్దరికీ, కెమెరా మెన్ కి మినహా ఎవరికి అతను సీన్స్ ఇవ్వడం లేదట. దీనికి కారణం ఎక్కడ లీక్ చేస్తారో అనే భయం రాజమౌళి లో ఎక్కువగా నెలకొంది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news