వాచ్‌ ఎందుకు ఎడమ చేతికే పెట్టుకుంటారు..?

-

ఎంత రెడీ అయినా.. చేతికి వాచ్‌ పెట్టకోకపోతే ఆ స్టైల్‌ రాదు.. వాచ్‌లో ఇప్పుడు బోలెడు రకాలు వచ్చాయి. సగం హెల్త్‌ టెస్ట్‌లు చేసే వాచ్‌లు కూడా ఉన్నాయి.. కానీ ఎక్కువ మంది ఎడమ చేతికి మాత్రమే వాచ్‌ పెట్టుకుంటారు.. మీరు కూడా అంతేగా.. కానీ ఎందుకు.. కుడి చేతికి ఎందుకు పెట్టుకోరు.. దీని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయట.

గతంలో టైం చూసుకోవాలంటే వాచ్ లపైనే ఆధారపడేవారు. కానీ ఇప్పుడు మొబైల్స్ రావడంతో వాచ్‌ల వాడకం తగ్గిపోయింది. అలాగే బైక్ రీడింగ్ దగ్గర కూడా టైం కనిపించేలా రూపొందిస్తున్నారు. దీనితో వాచ్‌ల వినియోగం తగ్గిపోయింది. ప్రస్తుత రోజుల్లో ఫ్యాషన్ కోసం మాత్రమే చేతి గడియారాలను ఉపయోగిస్తున్నారు. చేతికి వాచ్ ఉన్నా కూడా మొబైల్ లోనే టైం చూడడం అలవాటుగా మారింది. అయితే చాలా మందిని గమనిస్తే ఎక్కువగా ఎడమ చేతికి మాత్రమే వాచ్ పెడుతుంటారు. ఎందుకలా?

దాదాపు ఎక్కువ మంది ఎడమ చేతికి వాచ్ పెడుతుంటారు. కొంతమంది మాత్రం కుడి చేతికి కూడా పెడుతుంటారు. అయితే ఎడమచేతికి వాచ్ పెట్టడానికి కొన్ని కారణాలున్నాయి. మనం ఎక్కువగా కుడి చేతితోనే పని చేస్తుంటాం. రాయడం, తినడం, టైపింగ్ సహా కొన్ని పనులకు ఎడమ చేయి కంటే కుడి చేతినే ఎక్కువగా వాడుతారు. ఎక్కువగా కుడి చేతి వాటం కలవారే ఎక్కువగా ఉంటారు.

మనం కుడిచేతితో ఏదైనా పని చేసేటప్పుడు టైం చూసుకోవాలంటే ఆ పనిని ఆపేసి చూడాల్సి వస్తుంది. అదే ఎడమ చేతికి వాచ్ పెడితే మనం చేసే పనిని ఆపేయకుండా టైం చూడొచ్చు. కాబట్టి కుడిచేతికి వాచ్ పెట్టుకుంటే పనిలో ఉన్నప్పుడు చేసే పనిని మధ్యలో ఆపేయాల్సి ఉంటుంది. కాబట్టి చాలా మంది కూడా ఎడమ చేతికే వాచ్ పెడుతుంటారు. పెట్టుకోవాలని చెబుతుంటారు. ఒకవేళ మనం కుడిచేతికి పెట్టినా.. పక్కనోళ్లు అరే ఏంట్రా తప్పుగా పెట్టుకున్నావ్‌ అంటారు. మనకు తెలియకుండానే మనం ఈ పద్ధతిని పాటిస్తున్నాం.. ఇంతకీ మీరు ఏ చేతికి వాచ్‌ పెట్టుకుంటారు. అసలు మాకు వాచ్‌ వాడే అలవాటే లేదంటారా..!!

Read more RELATED
Recommended to you

Latest news