కడియం.. సాధారణంగా సినిమాల్లో చూపించినట్టు కడియం తీసి విలన్లని చావబాదడానికేనా అది పెట్టుకునేది అని చాలా మందికి అనుమానంగా ఉంటుంది. కడియం పెట్టుకునే వారికి కూడా అదెందుకు పెట్టుకుంటున్నారనే దాని మీద సరైన అవగాహన ఉండదు. దేవుడిది కాబట్టి పెట్టుకుంటున్నామనో, మా ఇంటి ఆచారం కాబట్టి ధరిస్తున్నామనో చెబుతుంటారు. కానీ, దాని వెనక కొన్ని నిజాలు దాగున్నాయని, కడియం పెట్టుకుంటే కలిగే ఉపయోగాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
కడియాల్లో చాలా రకాలున్నాయి. రాగితో చేసినవి, వెండితో చేసినవి, బంగారం, పంచలోహాలు ఇలా, ఎలాంటి లోహంతో అయినా చేసుకోవచ్చు. ఐతే రాగితో చేసిన కడియం ధరిస్తే శరీరంలో వేడి తగ్గుతుందని చెబుతారు. శరీరంలో వేడి ఎక్కువయితే అది ప్రమాదకరం. దాన్ని తగ్గించడానికి రాగితో కడియం వేసుకుంటారు. అది మన శరీరంతో చర్య జరిపి శరీర వేడిని తగ్గిస్తుంది.
వెండితో చేసిన కడియాలేమో విద్యుత్ తరంగాలను ప్రభావితం చేస్తాయి. ఇంకా, చేయికి ఏదైనా తగలకుండా దీన్ని ధరిస్తారు. అంటే, కడియం లేకపోతే డైరెక్టుగా చేయికి తగిలి అది పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంది. అలా కాకుండా కడియం వేసుకోవడం వల్ల, ఏదైనా తగిలితే ముందుగా దానికి తగిలి చేయి మీద పెద్దగా ప్రభావం చూపించదు. ఇంకా చెప్పాలంటే సినిమాల్లో చూపించినట్టు కడియం తీసి కొట్టేవాళ్ళు ఉంటారు. ఆత్మ రక్షణ కోసం ఇదొక ఆయుధంగా పని చేస్తుందని ధరించే వాళ్ళు ఎక్కువే. కాకపోతే ఎవరెలా ధరించినా దాని వెనక కారణమేంటన్నది తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. సో మీకు అర్థం అయిందనుకుంటా.